»   » నటికి డైరెక్టర్ వేధింపులు: ఫిర్యాదు చేయడంతో తొలగింపు... రచ్చరచ్చ!

నటికి డైరెక్టర్ వేధింపులు: ఫిర్యాదు చేయడంతో తొలగింపు... రచ్చరచ్చ!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  దర్శకుడి పై నటి నిషా సారంగ్ ఫిర్యాదు

  మలయాళ సినీ పరిశ్రమలో హీరో దిలీప్ కేసు, అమ్మ(అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్) వివాదం ఇంకా మరువరక ముందే... మరో సంఘటన హాట్ టాపిక్ అయింది. దర్శకుడు తనను వేధించాడని, అతడి మీద ఫిర్యాదు చేసినందుకు సీరియల్ నుండి తొలగించారని నటి నిషా సారంగ్ ఆరోపించారు. ఈ ఘటనతో మలయాళ సినీ పరిశ్రమలో మహిళల పట్ల వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో మరోసారి బట్టబయలైనట్లయింది.

  ‘ఉప్పుం ములకుం' డైరెక్టర్

  ‘ఉప్పుం ములకుం' డైరెక్టర్

  మలయాళంలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన సీరియల్ ‘ఉప్పుం ములకుం'లో నటి నిషా సారంగ్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సీరియల్‌కు ఆర్. ఉన్నికృష్ణన్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే కొంత కాలంగా దర్శకుడు తనను వేధిస్తున్నాడని, అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని నిషా సారంగ్ ఆరోపించారు.

  ఫిర్యాదు చేయడంతో తొలగించారు

  ఫిర్యాదు చేయడంతో తొలగించారు

  దర్శకుడు ఉన్నికృష్ణన్ వేధింపులపై ఛానల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో తనపై ఆ కోపం పెంచుకున్నాడని.... తనను ఉన్నట్టుండి సీరియల్ నుండి తొలగించారని నిషా సారంగ్ ఆవేదన వ్యక్తం చేశారు.

  సీరియల్ మొదలైనప్పటి నుండి వేధింపులు

  సీరియల్ మొదలైనప్పటి నుండి వేధింపులు

  సీరియల్ షూటింగ్ మొదలైనప్పటి నుండి దర్శకుడు తన పట్ల చెడుగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు, అసభ్యకరమైన సందేశాలు పంపేవాడు. వాటిని తాను పట్టించుకోవడం మానేశానను. దాంతో వేధింపులు మరింత ఎక్కువయ్యాయి.... అని నిషా సారంగ్ తెలిపారు.

  ఆ భయంతోనే ఇన్నాళ్లు భరించాను

  ఆ భయంతోనే ఇన్నాళ్లు భరించాను

  అతడి గురించి ఫిర్యాదు చేస్తే తనను ఈ సీరియల్ నుంచి నన్ను తొలగిస్తారన్న భయంతో ఇంతకాలం భరించాను. కానీ అతడి వేధింపులు రోజు రోజుకు ఎక్కువయ్యాయి. సె‌ట్‌లో తనను వేధించిన విషయం ప్రతి ఒక్కరికీ తెలుసని నిషా సారంగ్ తెలిపారు.

  అతడి వేధింపులు భరించడం నా వల్ల కాలేదు

  అతడి వేధింపులు భరించడం నా వల్ల కాలేదు

  అతడి వేధింపులు భరించడం నా వల్ల కాలేదు, అందుకే అతడిపై ఛానల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాను. దీంతో నాపై ఉన్నికృష్ణన్ కక్ష పెంచుకున్నాడు. ఓ అవార్డుల కార్యక్రమం కోసం అమెరికా వెళ్లి వచ్చే సరికి సీరియల్ నుంచి తనను తొలగించారని నిషా సారంగ్ తెలిపారు.

  సోషల్ మీడియాలో నిషా సారంగ్‌కు మద్దతు

  సోషల్ మీడియాలో నిషా సారంగ్‌కు మద్దతు

  సీరియల్ నుంచి ఆమెను ఆమెను తప్పించడంపై ప్రేక్షకలు, అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పలువురు ఈ సంఘటనపై సోషల్ మీడియా ద్వారా ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.

  English summary
  The most viewed Malayalam television show, Uppum Mulakum is currently in the news for all the wrong reasons. The show has hit the headlines after actress Nisha Sarang has raised serious allegations against the director of ‘Uppum Mulakum’ in which she plays a key role. Nisha, who plays the role of Neelima in the TV serial, has reportedly alleged that director of the show R. Unnikrishnan misbehaved with her several times. The reports further state that when the actress complained about the issue to the channel authorities, the director of Uppum Mulakum treated her with vengeance. After the incident, the actress has been replaced on the show.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more