కోరికలు తీర్చమన్నారు.. ఆ భయానికే గుడ్ బై చెప్పేశా.. యంగ్ యాక్టర్ షాకింగ్ కామెంట్
సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా లైంగిక వేధింపులు అనేవి అనేక రంగాల్లో ముందు నుంచి ఉన్నవే. సినిమా అనగానే సెలబ్రెటీస్ ఉంటారు కాబట్టి అందరు ఇక్కడే ఎక్కువగా ఫోకస్ చేస్తారు. గత కొంత కాలం నుంచి చాలా మంది హీరోయిన్స్ ఈ విషయం గురించి చెబుతూనే ఉన్నారు. సినిమాలోనే కాకుండా సీరియల్స్ లో నటిగా అవకాశాలు దక్కించుకోవాలి అంటే పడక పంచుకోవాల్సిందే అన్నవారు కూడా ఉన్నారు. ఇటీవల మళయాళం బ్యూటీ పూర్ణిత (కళ్యాణి) కూడా ఈ విషయంపై స్పందించింది.

మరో బ్యూటీ..
మీటూ ఉద్యమంలో స్టార్ హీరోయిన్స్ సైతం వారికి ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పారు. క్యాస్టింగ్ కౌచ్ అనేది ఈ కాలం నాటిది కాదు. హాలీవుడ్ నుంచి మాలీవుడ్ వరకు గత కొన్నేళ్లుగా ఇబ్బందులు పెడుతున్నదే. దీన్ని అరికట్టేందుకు సినిమా పెద్దలు స్పెషల్ గా కమిటీ వేసినప్పటికి మళ్ళీ సినీ పెద్దలే ఆ వివాదాల్లో ఇరుక్కోవడం గమనార్హం. మీటూ దెబ్బకు చాలా వరకు సినిమా ఇండస్ట్రీలలో చీకటి రహస్యాలు బయటపడ్డాయి. ఇటీవల కేరళ నటి కళ్యాణి కూడా తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పింది.

ఎక్కడికెళ్లినా..
మొదట తమిళ్ తెలుగు అని తేడా లేకుండా సౌత్ సినిమాలతో కాస్త బిజీగా మారిన కళ్యాణి కొన్నాళ్లకు బుల్లితెరకు షిఫ్ట్ అయ్యింది. ఇక మరికొన్ని రోజులకు సీరియల్స్ కూడా మానేసి యాంకర్ గా మారింది. అందుకు కారణం లైంగిక వేధింపులే నని ఈ బ్యూటీ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టింది. తమిళంలో జయం, ఎస్ఎమ్ఎస్, సినిమాలతో పాటు తెలుగులో మళ్ళీ మళ్ళీ అనే సినిమాలో నటించింది.

ఇరుక్కోవాల్సిందే
ఒక పెద్ద సినిమాలో నటించి స్టార్ హీరోయిన్ అవ్వాలని కొత్తగా అడుగులు వేసే ప్రతి హీరోయిన్ ఆశపడుతుంది. అయితే అలాంటి అవకాశాలు రావాలంటే కొంతమంది చెప్పినట్లు క్యాస్టింగ్ కౌచ్ ఊబిలో ఇరుక్కోవాల్సిందే అన్నట్లు కళ్యాణి తెలిపింది. ఒప్పుకుంటే అవకాశాలు వస్తాయని లేకుంటే వచ్చే చిన్న చిన్న అవకాశాలు కూడా మిస్ అవుతాయని తెలిపింది.
Recommended Video

యాంకర్స్ కి కూడా అవే ఇబ్బందులు
సినిమా హీరోయిన్స్ తో పాటు యాంకర్స్ కూడా పలు సందర్భాల్లో లైంగిక వేధింపులు ఎదుర్కోవాల్సి వస్తోందని కొందరు మా అమ్మకు ఫోన్ చేసిన అసభ్యంగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయని కళ్యాణి తెలిపింది. సినిమాల నుంచి సీరియల్స్ కి వచ్చినా నాకు ఆ ఇబ్బందులు తప్పలేదు. యాంకర్ గా ఉన్నప్పుడు కూడా వేధింపులు తట్టుకోలేకపోయాను. ఆ బయంతోనే సినీ పరిశ్రమకు దూరమైనట్లు కళ్యాణి వివరణ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











