ఆఫర్ ఇస్తా కాంప్రమైజ్ అవుతావా? కౌగిలిలో బంధించి అత్యాచారయత్నం.. డైరెక్టర్‌పై హీరోయిన్ కేసు
క్యాస్టింగ్ కౌచ్ కారణంగా సినీరంగంలో వెలిగిపోవాలని వచ్చిన ఎంతోమంది అమ్మాయిలు బలైపోయిన సంగతి తెలిసిందే. ఎంతోమంది నటీనటులు తమకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. ఇలాంటి దశలో దక్షిణాదిలోని మలయాళ చిత్ర పరిశ్రమపై హేమ కమిటీ రిపోర్ట్ ఈ రంగంలో మహిళల దుస్థితిని మరోసారి కళ్లకు కట్టింది. ఆ వెంటనే నటీమణులు ఒక్కొక్కరిగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ పెద్ద మనుషులుగా చెలామణి అవుతోన్న కొందరి నిజస్వరూపాలు బయటపెడుతున్నారు.
సుదీర్ఘకాలం పాటు జస్టిస్ హేమ కమిటీ రీసెర్చ్ చేసింది. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు మహిళా నటులను కలిసి వారి నుంచి కీలక సమాచారం రాబట్టింది. మలయాళ ఇండస్ట్రీ ఓ మాఫియా కనుసన్నల్లో నడుస్తోందని, ఇక్కడ క్యాస్టింగ్ కౌచ్ ఉందని కమిటీ తన నివేదికలో పేర్కొంది. మహిళలు తమపై జరిగే లైంగిక దాడులపై నోరు విప్పలేకపోతున్నారని.. వారిలో భయం, అభద్రతా భావం ఉందని నివేదికలో వెల్లడించింది. ఇక్కడ కమిట్మెంట్‌కు ఓకే చెప్పే నటీమణులను ఒక కేటగిరీగా విభజించారని కమిటీ చెప్పింది.

మరోవైపు.. జస్టిస్ హేమ కమిటీ నివేదికలో లైంగిక వేధింపులకు పాల్పడిన వారి వివరాలను బహిర్గతం చేయాలని ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ (ఎఫ్ఈఎఫ్‌కేఏ) అనుబంధ దర్శకుల యూనియన్ డిమాండ్ చేసింది. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని.. తమ యూనియన్‌లో ఉన్న సభ్యులు నిందితులైతే, వారిని అరెస్ట్ చేసే విషయంలో తాము జోక్యం చేసుకోబోమని పేర్కొంది. మహిళల కోసం సినిమా సెట్లు సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని దర్శకుడు ఆనంద్ ఇకర్షి సూచించారు.
ఇప్పటికే చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వెల్లువెత్తుతుండగా.. తాజాగా టెలివిజన్ సీరియల్ పరిశ్రమలో ఇలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి. ఆసియా నెట్‌లో ప్రసారమైన పాడతా పైంకిలిలో నటించిన తారా లక్ష్మీ ఆ సీరియల్ దర్శకుడు సుధీర్ శంకర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఓ షార్ట్ ఫిల్మ్ కోసం పనిచేస్తుండగా.. సుధీర్ ఓ ప్రొడక్షన్ కంట్రోలర్ ద్వారా తనను ఆడిషన్‌కు పిలిచినట్లు ఆమె చెప్పారు. తనకు సీరియల్ కథ గురించి చెబుతూ.. నటీనటుల పాత్రలను వివరించాడని.. నీ పాత్ర జనానికి గుర్తుండిపోతుందని అయితే నువ్వు అడ్జస్ట్ కావాల్సి ఉంటుందని చెప్పాడని పేర్కొన్నారు.

అడ్జస్ట్ అంటే ఏంటని తాను అడగ్గా సుధీర్ నా చేయి పట్టుకుని కౌగిలించుకోబోయాడని.. దీంతో భయపడిన తాను అతనిని పక్కకి తోసేసి పారిపోయినట్లు తార చెప్పారు. ఈ ఘటనపై అప్పటికప్పుడే మ్యూజియం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేగా.. దర్శకుడు తర్వాత రాజీకి ప్రయత్నించాడని, అతని కుటుంబం ఎంతో వేదన అనుభవించడంతో తాను కేసు పెట్టకూడదని 2019 నాటి ఘటనను తారా లక్ష్మీ వెల్లడించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు మలయాళ బుల్లితెర పరిశ్రమలో చర్చనీయాంశమయ్యాయి. లక్ష్మీని చూసి మరికొందరు బాధితులు తెరపైకి వచ్చే అవకాశం ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











