twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తండ్రికి యువ దర్శకుడు పునర్జన్మ.. కాలేయదానంతో రుణం తీర్చుకొన్న కొడుకు!

    |

    జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడం ప్రతీ ఒక్కరికి అరుదైన అవకాశం. అలాంటి గొప్ప అవకాశం అందరికి అంత సులభంగా లభించదు. తాజాగా మలయాళం చిత్ర పరిశ్రమకు సంబంధించిన యువ దర్శకుడు తన తండ్రి కోసం ప్రాణాలకు తెగించారు. చావు బతుకుల మధ్య నిలిచిన తండ్రికి అవయవ దానం చేసి యువ దర్శకుడు పునర్జన్మను కల్పించడంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. యువ దర్శకుడు తండ్రి కోసం ఏం చేశారంటే..

    అధిన్ ఒల్లూరు తండ్రికి అనారోగ్యం

    అధిన్ ఒల్లూరు తండ్రికి అనారోగ్యం

    మాలీవుడ్‌లో యువ దర్శకుడు అధిన్ ఒల్లూరు తండ్రి గత కొద్దికాలంగా కాలేయ (లివర్) సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆయనకు లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగితే తప్ప ఆరోగ్యం తిరిగి మామూలు స్థితికి చేరుకోదని వైద్యులు స్పష్టం చేశారు. దాంతో కాలేయ మార్పిడి తప్పనిసరి అయింది. దాత కోసం ప్రయత్నాలు విస్తృతంగా చేసినా ఫలితం దక్కలేదు.

    దాతలు దొరకకపోవడంతో స్వయంగా

    దాతలు దొరకకపోవడంతో స్వయంగా

    దాంతో అధీన్ ఒల్లూరు సాహోసోపేతమైన నిర్ణయాన్ని తీసుకొన్నారు. తన తండ్రికి స్వయంగా తానే కాలేయ దానం చేయడానికి ముందుకొచ్చారు. దాంతో వైద్యులు కాలేయ మార్పిడి చికిత్సను పూర్తి చేశారు. ప్రస్తుతం అధీన్ ఒల్లూరు తండ్రి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ విషయాన్ని స్వయంగా అధీన్ తన ఫేస్‌బుక్‌లో పేర్కొన్నాడు.

    నా తండ్రికి కాలేయదానం చేసే లక్కీ ఛాన్స్

    నా తండ్రికి కాలేయదానం చేసే లక్కీ ఛాన్స్

    నా తండ్రికి కాలేయం దానం చేసే లక్కీ ఛాన్స్ వచ్చిందనే విషయాన్ని తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది. మే 18న సర్జరీ జరిగింది. నేను, నా తండ్రి ఇద్దరం ఆరోగ్యంగా ఉన్నాం. హాస్పిటల్ నుంచి కొద్ది రోజుల క్రితం డిశ్చార్జి అయి ఇంటికి వచ్చాం. నా స్నేహితులు, సన్నిహితులు చేసిన ప్రార్థనలు ఫలించాయి అని అధీన్ తన ఫేస్‌బుక్‌లో తెలిపారు.

    నాకు నైతిక మద్దతు ఇచ్చిన వారికి..

    నాకు నైతిక మద్దతు ఇచ్చిన వారికి..

    నా జీవితంలో విపత్కరమైన సవాల్‌‌ను ఎదుర్కొంటున్న సమయంలో నాకు నైతిక మద్దతు ఇచ్చిన ప్రతీ ఒక్కరికి నా ధన్యవాదాలు. నా తండ్రికి పునర్జన్మను ఇచ్చిన వైద్యులుకు జీవితాతం రుణపడి ఉంటాను. అవయవ దానం విశిష్టతను తెలుసుకొన్నాను. అవయవదానం అంటే మరొకరికి జన్మినివ్వడమే.. కాబట్టి మీరు కూడా అవయవ దానం చేయండి అంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి వెల్లడించారు.

    అధిన్ కెరీర్ ఇలా..

    అధిన్ కెరీర్ ఇలా..

    అధిన్ కెరీర్ విషయానికి వస్తే.. మలయాళంలో పెన్నన్‌వేషనమ్ అనే చిత్రం ద్వారా పరిశ్రమలోకి ప్రవేశిస్తున్నారు. ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న సమయంలో లాక్ డౌన్ విధించారు. దాంతో సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మలయాళ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది.

    English summary
    Malayalam young director Adhin Ollur dontes liver to his father who is suffering liver related Issues. In this junxture, Adhin comes forward to donate his liver and surgery happend on May 18. Both were discharged from hospital are doing well.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X