యువ దర్శకుడు మృతి.. తొలి సినిమా రిలీజ్‌కు ముందే కన్నుమూత!
మలయాళ సినీ రంగానికి చెందిన యువ దర్శకుడు జోసెఫ్ మను జేమ్స్ ఆకస్మిక మరణం సినీ అభిమానులను శోక సంద్రంలో ముంచింది. తొలి చిత్ర దర్శకుడిగా ఆయన రూపొందించిన నాన్సీ రాణి సినిమా రిలీజ్‌కు మరణించడం సినీ వర్గాలను కలిచివేస్తున్నది. హెపటైటిస్‌తో బాధపడుతూ న్యూమెనియా ఆరోగ్య సమస్యతో చికిత్స కోసం హాస్పిటల్‌లో చేరారు. ట్రీట్‌మెంట్ పొందుతూ జోసెఫ్ ఫిబ్రవరి 25న కేరళలోని ఎర్నాకులంకు సమీపంలోని అలువాలో మరణించారు. జేమ్స్ వయసు 31 సంవత్సరాలు. ఆయన అంత్యక్రియలు ఫిబ్రవరి 26వ తేదీన ముగిశాయి.
మలయాళ మీడియా వెల్లడించిన ప్రకారం.. మను జేమ్స్ రాజగిరి హాస్పిటల్‌లో మరణించారు. హెపటైటీస్‌తో కొద్దికాలంగా బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ కోలుకొన్నట్టే కనిపించారు. అయితే ఆకస్మాత్తుగా ఫిబ్రవరి 25వ తేదీన తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన మృతికి శ్రీనివాసన్, లాల్, ఇంద్రాన్స్, నటి ఆహానా సంతాపాన్ని తెలియజేశారు.

జోసెఫ్ మను జేమ్స్ కెరీర్ విషయానికి వస్తే.. బాలనటుడిగా ఇండస్ట్రీలోకి వచ్చారు. డైరెక్టర్ సాబు జేమ్స్ రూపొందించిన ఐయామ్ క్యూరియస్ అనే చిత్రంలో నటించారు. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా, కో డైరెక్టర్‌గా మలయాళం, కన్నడ, హిందీ రంగాల్లో పలు సినిమాలకు పనిచేశారు. ఇటీవల ఆయన నాన్సీ రాణి అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అహానా కృష్ణ, అర్జున్ అశోకన్ నటించారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకలు ముందుకు రానున్నది.


Click it and Unblock the Notifications











