లైంగిక వేధింపుల కేసులతో షూటింగ్ మధ్యకి డైరెక్టర్ అరెస్ట్.. సంచలనంగా మారిన రేప్ ఆరోపణలు?

సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల విషయం కొత్తదేమీ కాదు. ఎప్పటికప్పుడు ఎవరో ఒకరు తనను లైంగికంగా వేధించారు అంటూ అనేక మంది సినీ పరిశ్రమకు సంబంధం ఉన్న మహిళలు మీడియా ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.. అయితే సినీ పరిశ్రమకు ఏ మాత్రం సంబంధం లేని ఒక మహిళ తనను ఒక దర్శకుడు లైంగికంగా వేధించాడు అంటూ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో సదరు దర్శకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరు పరిచినట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే

మేజిస్ట్రేట్

మేజిస్ట్రేట్

ఈ మధ్యకాలంలో సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు అంశాలు అనేక సందర్భాలలో తెరమీదకు వస్తున్నాయి. కానీ ఏ వ్యవహారం కూడా పోలీసులు వరకు వెళ్లలేదు. లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు తప్ప ఎవరు ఎవరు మీద కేసులు పెట్టిన అంశాలు అయితే లేవు. అయితే మలయాళ సినీ దర్శకుడు ఒకరు తనను లైంగికంగా వేధించాడని రేప్ కూడా చేశాడని చెబుతూ ఒక మహిళ ఫిర్యాదు చేయడంతో సదరు దర్శకుడు మీద కేసు నమోదు చేసిన పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు.

సంచలనంగా

సంచలనంగా

"పడవెట్టు అనే మలయాళ చిత్రం తెరకెక్కిస్తున్న దర్శకుడు లిజు కృష్ణను అత్యాచారం ఆరోపణలపై ఆదివారం కేరళలోని కన్నూర్ లో ఆయనని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనని సోమవారం నాడు కొచ్చిలోని మేజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరచనున్నారు. ఈ వివాదం మాలీవుడ్ పరిశ్రమలో సంచలనంగా మారింది.

అరెస్ట్ చేయడంతో

అరెస్ట్ చేయడంతో

పడవెట్టు సినిమా దర్శకుడు లిజు కృష్ణ తనను లైంగికంగా వేధించాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కాకనాడ్ ఇన్ఫోపార్క్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కస్టడీలోకి తీసుకున్న సమయంలో లిజు స్వస్థలం కన్నూర్‌లో పడవెట్టు షూటింగ్ కొనసాగుతోంది. దర్శకుడిని అరెస్ట్ చేయడంతో సినిమా షూటింగ్ నిలిపివేశారు.

మంజు వారియర్, నివిన్ పౌలీ ప్రధాన పాత్రల్లో

మంజు వారియర్, నివిన్ పౌలీ ప్రధాన పాత్రల్లో

మంజు వారియర్, అదితి బాలన్, నివిన్ పౌలీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను నటుడు సన్నీ వేన్ నిర్మించారు. పెదవెట్టు సినిమాతో దర్శకుడిగా లిజు కృష్ణ వెండి తెరకు పరిచయం కానున్నాడు. అయితే ఇంతకుముందు.. సన్నీ వేన్, లిజు కలిసి మూమెంట్ జస్ట్ బిఫోర్ డెత్ అనే నాటకానికి పనిచేశారు. ఈ నాటకానికి సన్నీ దర్శకత్వం వహించగా, లిజు నిర్మించారు. ఆ రోల్స్ ఇప్పుడు తారుమారయయాయి.

Recommended Video

DOP Subramanyam Speech | Aadavaallu Meeku Johaarlu | Filmibeat Telugu
పలుమార్లు అఘాయిత్యానికి

పలుమార్లు అఘాయిత్యానికి

ఇక ఈ విషయం మీద ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ..లిజు కృష్ణను ఐపీసీ 376 సెక్షన్ కింద అరెస్టు చేశామని అన్నారు. ఫిర్యాదు చేసిన మహిళ సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తి కాదని..అందుకే ఆ మహిళకి చెందిన వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. ఆ మహిళతో లిజు కృష్ణకు కొన్నాళ్లుగా పరిచయం ఉందని వెల్లడించారు. 2020 డిసెంబరు 20 నుంచి 2021 జూన్​ వరకు కొచ్చిలోని కక్కనాడ్​కు చెందిన సదరు మహిళపై.. లీజు పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడినట్లు ఫిర్యాదు చేసినట్టు సదరు అధికారి పేర్కొన్నారు. మరి ఈ విషయం ఎంత దూరం వెళ్లనుంది అనేది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X