ప్రముఖ దర్శకుడి అరెస్ట్.. కారవాన్‌లోకి పిలిచి నటిపై లైంగిక దాడి కేసులో రిమాండ్!

లైంగిక వేధింపుల ఆరోపణలతో నమోదైన కేసులో ప్రముఖ మలయాళ దర్శకుడు రంజిత్ బాలకృష్ణన్‌ను కేరళ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆయనపై నటి చేసిన ఫిర్యాదుపై స్పందించిన కోచి పోలీసులు కఠిన చర్యలు తీసుకొన్నారు. బాధితురాలి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. నాటకీయ ఫక్కీలో జరిగిన దర్శకుడు రంజిత్ అరెస్ట్ మలయాళ సినిమా ఇండస్ట్రీతోపాటు దక్షిణాది సినిమా పరిశ్రమలో సంచలనం రేపింది. దర్శకుడు రంజిత్ అరెస్ట్, బాధిత నటి ఫిర్యాదుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం.. కోచి ఫోర్ట్ వద్ద షూటింగ్ జరుగుతున్న సమయంలో దర్శకుడు రంజిత్ నన్ను తన కారవాన్‌లోకి ఆహ్వానించాడు. ఆ తర్వాత నా ఇష్టానికి వ్యతిరేకంగా ఆయన నాపై లైంగిక దాడి జరిపాడు. బయటకు చెప్పుకోలేని చోట తడిమాడు అని కొద్ది రోజుల క్రితం కోచిలోని మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధిత నటి ఫిర్యాదు మేరకు సోమవారం స్టేట్‌మెంట్ రికార్డు చేశాం అని కోచి సిటీ పోలీసులు తెలిపారు.

Malayalam director Ranjith Balakrishnan Arrested

దర్శకుడు రంజిత్‌పై లైంగిక దాడి ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా పలు ఆరోపణలు వచ్చాయి. 2024లో ఓ నటి ఆయనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ కేసు నమోదు చేసింది. దాంతో అప్పట్లో సిటీ పోలీస్ కమిషనర్ పరిధిలో కేసు నమోదైంది. సంచలనం రేపిన జస్టిస్ కే హేమ కమిటీ రిపోర్ట్ తర్వాత ఆయన వచ్చిన ఆరోపణలపై పోలీసులు నిఘా పెట్టారు.

బాధిత నటి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన కోచి పోలీసులు.. ఇడుక్కి జిల్లాలో రంజిత్ బాలకృష్ణన్‌ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత తొడుపుజి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత ఆయనను కోచి పోలీసులకు అప్పగించారు. ఆరెస్ట్‌ను ధృవీకరించుకొన్న తర్వాత ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం జిల్లా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈ కేసును పరిశీలించిన తర్వాత ఆయనకు 14 రోజుల జుడిషియల్ కస్టడీకి తరలించారు.

దర్శకుడు రంజిత్ ఓ ప్రైవేట్ కార్యక్రమం కోసం తొడుపుజ పట్టణానికి వెళ్లారు. ఆయన వచ్చారనే సమాచారం అందుకొన్న స్థానికి పోలీసులు సీక్రెట్‌గా వ్యవహారం నిర్వహించి ఆయనను అదుపులోకి తీసుకొన్నారు. ఈ ఆపరేషన్ అంతా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో జరిగింది. ఆయన అరెస్ట్ సినీ ఫక్కీలో గుట్టు చప్పుడు కాకుండా ముగిసింది.

దర్శక, నిర్మాత రంజిత్ బాలకృష్ణన్ కెరీర్ విషయానికి వస్తే.. సుమారుగా 70కి పైగా చిత్రాలకు దర్వకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన అయ్యప్పనుమ్ కోషియం, నాయట్టు, ముకుందన్ ఉన్ని అసోసియేట్స్, నాడికర్, తలవాన్, సీక్రెట్, మనోరథంగల్ సినిమాలకు ఇటీవల దర్శకత్వం వహించారు. 1987 సంవత్సరంలో ఎజుథప్పురంగళ్ అనే సినిమా ద్వారా దర్శకుడిగా మారారు. ఆయన రూపొందించిన తిరక్కథ, ఇండియన్ రూపీ సినిమాలకు జాతీయ అవార్డులు లభించాయి. రావణ ప్రభు, దేవాసురమ్, స్పిరిట్ సినిమాలకు ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డులు లభించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X