Director Siddique Passed Away: సినీ పరిశ్రమలో విషాదం.. గుండెపోటుతో నితిన్ డైరెక్టర్ మృతి

సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ దర్శకుడు సిద్ధిఖి కన్నుమూశారు. తెలుగులో నితిన్ తో మారో అనే సినిమా తెరకెక్కిన ఈ దర్శకుడికి సోమవారం గుండె పోటు రావడంతో.. కేరళలోని కొచ్చిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. ఇక వైద్యులు పరిక్షించి.. ఆయన లివర్ సంబంధిత సమస్యలతో పాటు న్యూమెనియాతో ఉన్నట్లు వెల్లడిచారు. ఇక ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. ఆ వివరాల్లోకి వెళితే...

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం సంభవించింది. ప్రముఖ మలయాళ డైరెక్టర్ సిద్ధిఖీ.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సిద్ధిఖీ అసలు పేరు సిద్ధిఖీ ఇస్మాయిల్. ఇక ఆయన కేవలం దర్శకుడిగా కాకుండా... స్క్రీన్ రైటర్, ప్రొడ్యూసర్ గా కూడా సినిమా ఇండస్ట్రీకి సేవలు అందించారు. 1954 ఆగస్టు 1న జన్మించిన సిద్ధిఖీ... 69 ఏళ్లలో ఆయన మరణించారు. ఆయన మరణంతో అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు.

Malayalam Director Siddique Dies Due to Heart Attack Details Here

సోమవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో సిద్ధిఖీకి గుండె పోటు వచ్చింది. గుండె పోటు రావడంతో... కేరళలోని కొచ్చిలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు బంధువులు. పరీక్షలు చేసిన వైద్యులు లివర్ సంబంధిత సమస్యలతో పాటు న్యుమోనియా ఉన్నట్లు వెల్లడించారు. సిద్ధిఖీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు కూడా బయటకు వచ్చాయి. ఇక మలయాళ చలన చిత్ర పరిశ్రమ నుంచి ఆయన పరిస్థితి విషమం అన్నట్లు బయటకు న్యూస్ బయటకు వచ్చింది.

సిద్ధిఖీ ఎక్మో సాయంతో వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు మాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. ఆయన త్వరగా కోలుకుంటారని అభిమానులు కూడా భావించారు. అయితే సిద్ధిఖీ.. చికిత్స పొందుతూ ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఇక సిద్ధిఖి తెలుగులో నితిన్ తో మారో అనే సినిమా తెరకెక్కించారు. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం చెందింది.

Malayalam Director Siddique Dies Due to Heart Attack Details Here

సిద్ధిఖీ తొలి సినిమా మెహన్ లాల్ హీరోగా 'రాంజీ రావు స్పీకింగ్' సినిమాకు దర్శకత్వం వహించాడు. మోహన్ లాల్ హీరోగా 'ఇన్ హరిహర నగర్', 'గాడ్ ఫాదర్', 'వియత్నామ్ కాలనీ', 'కాబూలీవాలా' సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. ఇక సిద్ధిఖీ దర్శకత్వం వహించిన చివరి సినిమా బిగ్ బ్రదర్. ఇక ఈ సినిమాలోనూ.. మోహన్ లాల్ హీరో కావడం విశేషం. 'బిగ్ బ్రదర్' మూవీ తెలుగులో డబ్ అయింది.

ఎన్నో సూపర్ హిట్టు సినిమాలను తెరకెక్కించిన సిద్ధిఖి మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని చెప్పవచ్చు. సినీనటులు ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నారు. ఇక ఆయన అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X