Siddique: నితిన్ డైరెక్టర్‌కు గుండెపోటు.. తీవ్ర విషమంగా ఆరోగ్య పరిస్థితి

ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమలో విషాదలు ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా గుండెపోటు వార్తలు తరచూ వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే నటి షణ్ముఖ ప్రియ భర్త ఇదే కారణంతో మరణించగా.. ఆదివారం తెలుగు సినీ పరిశ్రమతో సంబంధం ఉన్న గద్దర్.. సోమవారం కన్నడ నటి చనిపోయారు. ఈ పరిస్థితుల్లో తాజాగా మలయాళంలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా వెలుగొందుతూ.. దాదాపు రెండు దశాబ్దాలుగా తనదైన చిత్రాలతో ప్రేక్షకులకు అలరిస్తున్న టాలెంటెడ్ దర్శకుడు సిద్దిక్ గుండెపోటుకు గురయ్యారు.

మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు సిద్దిక్‌ సోమవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో గుండెపోటుకు గురయ్యారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి ఆయనను తరలించారు. అప్పటి నుంచి ఆస్పత్రి వైద్యులు ఈ డైరెక్టర్‌కు మెరుగైన చికిత్సను అందిస్తున్నారు. అక్కడికి వచ్చినప్పటి నుంచి సిద్దిక్ పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాల ద్వారా తెలిసింది. ఆయనకు ఎన్నో టెస్టులు చేసిన వైద్యులు.. సరైన వైద్యాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు.

Malayalam Director Siddique Gets Massive Heart Attack And Admitted In Hospital

ఇక, ప్రస్తుతం మలయాళ డైరెక్టర్ సిద్దికి ఆరోగ్య పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఆయన ఇప్పుడు ఎక్మో సపోర్ట్ (గుండె, ఊపిరితిత్తుల రోగులకు లైఫ్ సపోర్ట్)లో ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి తదుపరి మరింత మెరుగైన చికిత్స అందించేందుకు మంగళవారం ఉదయం మెడికల్ బోర్డు సమావేశం కానుందని తెలుస్తోంది. ఆ తర్వాతనే ఆస్పత్రి వర్గాలు సిద్దికి ఆరోగ్యంపై బులిటెన్‌ను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇక, ఆయన ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Malayalam Director Siddique Gets Massive Heart Attack And Admitted In Hospital

ఇదిలా ఉండగా.. సిద్దిక్ Pappan Priyappetta Pappan అనే చిత్రం ద్వారా కథా రచయితగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 'రాంజీరావు స్పీకింగ్' చిత్రంతో దర్శకుడిగా మారారు. అక్కడి నుంచి మలయాళం, తమిళంలో ఎన్నో సినిమాలు తెరకెక్కించారు. వీటిలో బాడీ గార్డ్, గాడ్ ఫాదర్, ఫ్రెండ్స్, హిట్లర్, బిగ్ బ్రదర్ బిగ్ హిట్లుగా నిలిచాయి. ఈ క్రమంలోనే తెలుగులో నితిన్‌తో 'మారో' సినిమా చేశారు. ఇది డిజాస్టర్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X