మలయాళ నటుడు కళాశాల బాబు మృతి
ప్రముఖ మలయాళం నటుడు కళాశాల బాబు మృతి చెందారు. కొంతకాలంగా గుండె సంబంధమైన వ్యాధితో బాధ పడుతున్న ఆయన ఆదివారం రాత్రి ఎర్నాకులంలో తుది శ్వాస విడిచారు. కళాశాల వయసు 68 సంవత్సరాలు.
ప్రముఖ కథాకళి కళాకారులైన కళామండలం కృష్ణన్ నాయర్, మోహినియట్టమ్ నృత్యకారిణి కళ్యాణి కుట్టి అమ్మ కుమారుడైన కళాశాల బాబు...నాటకరంగంలో తన కెరీర్ మొదలు పెట్టారు. తర్వాత సినిమాల వైపు అడుగులు వేశారు. మలయాళ చిత్రం 'ఇనెయా థేడి బై జాన్ పాల్' సినిమా ద్వారా ఆయన ఫిల్మ్ కెరీర్ ప్రారంభించారు.

తన కెరీర్లో 50కి పైగా చిత్రాల్లో కళాశాల బాబు నటించారు. మమ్ముట్టితో 'తురుప్పు గులన్', దిలీప్‌తో 'రన్ వే', మోహన్ లాల్‌తో 'బాలెట్టన్', మమ్ముట్టి, పృధ్విరాజ్‌తో కలిసి 'పోక్కిరి రాజా' లాంటి హిట్ చిత్రాల్లో నటించారు.
కళాశాల బాబు ఎక్కువగా నెగెటివ్ క్యారెక్టర్లతో పాపులర్ అయ్యాడు. కాంప్లికేటెడ్ రోల్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన తన భార్య లలితతో కలిసి ఉండటుండగా, కూతురు శ్రీదేవి యూఎస్ఏ, కుమారుడు విశ్వానాథన్ ఐర్నాండులో సెటిల్ అయ్యారు.


Click it and Unblock the Notifications











