యువ దర్శకురాలి అనుమానాస్పద మృతి.. ఆ బాధతోనే చనిపోయిందా!

చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. తాజాగా మలయాళీ చిత్ర పరిశ్రమకు చెందిన ఓ దర్శకురాలి మృతి మిస్టరీగా మారింది. 28 ఏళ్ల నయన సూర్యన్ తన ఫ్లాట్ లో ఆదివారం రాత్రి మరణించి కనిపించారు. పోలీసులు నయన మృతిపై దర్యాప్తు జరుపుతున్నారు. నయన మృతి వెనుక అనేక అనుమానాలు వినిపిస్తున్నాయి. నయన సూర్యన్ మృతికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

 అసోసియేట్ డైరెక్టర్ గా

అసోసియేట్ డైరెక్టర్ గా

నయన సూర్యన్ సినిమారంగంపై ఉన్న ఆసక్తితో దర్శకురాలిగా రాణించాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. లెనిన్ రాజేంద్రన్, జీతూ జోసెఫ్, డాక్టర్ బిజు లాంటి ప్రముఖ దర్శకుల వద్ద నయన అసోసియేట్ దర్శకురాలిగా పనిచేశారు. నయన దర్శకురాలిగా తెరకెక్కించిన తొలి చిత్రం క్రాస్ వర్డ్. సినీరంగంలోకి రాకముందు నయన పలు ప్రకటనలకు దర్శత్వం వహించారు.

ఆదివారం రాత్రి ఏం జరిగింది

ఆదివారం రాత్రి ఏం జరిగింది

ఆదివారం సాయంత్రం నయన సూర్యన్ తల్లి ఆమెకు ఫోన్ చేసారు. తన కుమార్తె ఎంతకూ ఫోన్ ఎట్టకపోవడంతో ఆమెలో కంగారు మొదలైంది. వెంటనే నయన స్నేహితులకు ఫోన్ చేసి ఆరా తీశారు. దీనితో ఆమె స్నేహితులు నయన ఫ్లాట్ కు వెళ్లి చూడగా ఆమె మరణించి కనిపించింది. నయన మరణంపై ఆమె స్నేహితులు ఒక్కొక్కరు ఒక్కో సమాధానం ఇస్తున్నారు. ఆమె స్నేహితురాలు ఒకరు మాట్లాడుతూ.. నయన కొంతలంగా డయాబెటిస్ తో భాదపడుతున్నట్లు తెలిపింది.

ఆత్మహత్య

ఆత్మహత్య

మరికొందరి వాదన ప్రకారం.. నయనకు దర్శకత్వంలో ఓనమాలు నేర్పిన దర్శకుడు లెనిన్ రాజేంద్రన్. ఆయన గత జనవరిలో ఆకస్మిక మరణం చెందారు. లెనిన్ మృతిని తట్టుకోలేక నయన ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై ఇప్పటికే నయన కుటుంబ సభ్యులని ఆరా తీయడం ప్రారంభించారు.

ఆరోగ్య సమస్యలు

ఆరోగ్య సమస్యలు

నయన మృత దేహాన్ని ఆమె స్నేహితులు చూడగానే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే నయన మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు. ఆమె బాడీలో బిపి, షుగర్ లెవల్స్ బాగా పడిపోయాయని, దీనిని బట్టి నయన ఆదివారం ఉదయమే మృతి చెందిఉంటుందని డాక్టర్లు తెలిపారు. నయన మృతికి ఆరోగ్య సమస్యలే కారణం అని వైద్యులు ప్రాధమిక అంచనాకు వచ్చారు. పోస్ట్ మార్టం వివరాలు బయటకు వచ్చాక నయన మృతికి అసలు కారణం తెలియనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X