డైరెక్టర్‌పై యువ హీరోయిన్ ఫిర్యాదు.. లుకౌట్ నోటీస్ జారీ చేసిన పోలీసులు
మలయాళ సినీ పరిశ్రమను కుదిపేసిన హేమ కమిటీ ప్రకంపనలు సద్దుమణుగుతున్నాయనే ఫీలింగ్ కలిగిన నేపథ్యంలో తాజాగా ఓ దర్శకుడిపై హీరోయిన్ కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో తనపై అభ్యంతర, అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఆయనపై నటి ఫిర్యాదు చేయడంతో ఎలమక్కర పోలీసులు రంగంలోకి దిగారు. ఆయనపై కేసు నమోదు చేసి ఆయన ఆచూకీ కోసం వేట ప్రారంభించారు. ఈ వివాదాస్పద సంఘటన గురించిన వివరాల్లోకి వెళితే..
ప్రముఖ దర్శకుడు సనల్ కుమార్ శశిధరన్‌పై మలయాళ నటి ఎలమక్కర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా, అవమానకరమైన రీతిలో పోస్టులు పెట్టారు అని హీరోయిన్ ఫిర్యాదు చేశారు. దాంతో బాధితురాలి కంప్లయింట్‌కు స్పందించి కేసు నమోదు చేశారు. ఆయనను అరెస్ట్ చేసేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు.

దర్శకుడు సలన్ ఆడియో సంభాషణలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ తనను ట్యాగ్ చేస్తున్నాడు. దాంతో నా ప్రాణాలకు ముప్పు ఏర్పడింది. సదరు నటితో దర్శకుడు రూపొందించిన సినిమాను ఇటీవల సోషల్ మీడియాలో కూడా విడుదల చేయడం ఈ వివాదానికి బీజం పడిందనే వాదన ఇండస్ట్రీలో నెలకొన్నది.
ఇదిలా ఉండగా, దర్శకుడు సనల్‌కు ఇలాంటి కేసుల కొత్తేమీ కాదని పోలీసులు పేర్కొన్నారు. ఈ నటి నుంచే గతంలో లీగల్ సమస్యలు ఎదుర్కొన్నాడు. గతంలో సోషల్ మీడియాలో వేధిస్తున్నారనే ఆరోపణలపై ఆయనను తిరువనంతపురం పరశాల పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో తనపై వేధింపులకు పాల్పడుతున్నట్టు ఆమె గతంలో ఫిర్యాదు చేయడం.. ఆ కేసులో ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు. మరోసారి ఆమెనే ఆయనపై ఫిర్యాదు చేయడం మరింత వివాదంగా మారింది.

తాజాగా నమోదైన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సనల్‌పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆయనను అరెస్ట్ చేసేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం దర్శకుడు సనల్ అమెరికాలో ఉన్నట్టు సమాచారం. ఇక సనల్ కెరీర్ విషయానికి వస్తే.. ఓరాల్‌ప్పోక్కమ్ సినిమా ద్వారా దర్శకుడిగా మారారు. 2020లో మంజు వారియర్ ప్రధాన పాత్రలో ఐఫోన్ ద్వారా ఓ సినిమాను హిమలయాల బ్యాక్ డ్రాప్‌లో రూపొందించారు. ఆయన రూపొందించిన సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకొన్నాయి.


Click it and Unblock the Notifications











