For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సీఎంపై హీరోయిన్స్ ఫైట్.. అలా ఎలా తప్పిస్తారు.. ఆ పొలిటికల్ లీడర్‌కు అండగా..

  |

  పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ఇటీవల కేరళలో రెండోసారి అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే గతంలో కేరళలో ఒక ప్రభుత్వం రెండోసారి మళ్లీ అధికారం చేపట్టడం జరగలేదు.. కానీ మొట్ట మొదటి సారి అలా రెండోసారి అధికారం చేపట్టారు పినరయి విజయన్.

  అయితే గత క్యాబినెట్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేసిన కేకే శైలజ అలియాస్ శైలజ టీచర్ మొన్నటి ఎన్నికల్లో కేరళ మొత్తం మీద అధిక మెజార్టీతో గెలుపొందారు. అయితే ఆమెకు ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వకపోవడం కేరళ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.. దీని మీద పెద్ద ఎత్తున మళయాళ హీరోయిన్స్ సీఎంను ప్రశ్నిస్తూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు పెడుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

  శైలజా టీచర్‌గా సుప్రసిద్ధురాలు

  శైలజా టీచర్‌గా సుప్రసిద్ధురాలు

  కరోనా వైరస్ కట్టడి చర్యల్లో కేరళ ఆరోగ్య మంత్రిగా శైలజ తన పనితీరుతో సర్వత్రా ప్రశంసలందుకున్నారు. అయితే ఆమెను పార్టీ పాలసీ మేరకు మంత్రివర్గంలోకి తీసుకోలేదని తెలుస్తోంది. కెరీర్ మొదట్లో టీచర్ గా పనిచేసిన ఆమె శైలజా టీచర్‌గానే సుప్రసిద్ధురాలు. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో మట్టనూరు నుంచి ఆమె 60 వేల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు తీసుకున్న చర్యలకు గాను ఆమె అంతర్జాతీయ వ్యాప్తంగా గుర్తింపు పొందారు.

  అంతర్జాతీయ గుర్తింపు

  అంతర్జాతీయ గుర్తింపు

  కేరళలో కరోనావైరస్‌పై పోరాటంలో ఆరోగ్య మంత్రిగా చేసిన కృషికి గాను ఆమెకు పెద్ద ఎత్తున ఫాలోయింగ్ కూడా లభించింది. అయితే పినరయి విజయన్ కొత్త క్యాబినెట్‌లో ఆమెకు చోటు మాత్రం దక్కలేదు. ఎందుకంటే కేరళలోని సీపీఎం కోర్ కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకు ఎల్‌డీఎఫ్ క్యాబినెట్‌లో 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే గతంలో పని చేసినవారికి కాకుండా కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే ఈ నిర్ణయం తీసుకున్నారు అని చెబుతున్నారు.

  సోషల్ మీడియాలో వైరల్

  సోషల్ మీడియాలో వైరల్

  శైలజా టీచర్‌గా ప్రాచుర్యం పొందిన శైలజను క్యాబినెట్‌ నుంచి తొలగించడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఆమె కోసం పెద్ద ఎత్తున మళయాళ నటీనటులు సోషల్ మీడియా వేదికగా సీఎంను కోరుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సహా మలయాళ నటీమణులు పార్వతి, మాళవికా మోహనన్, అనుపమ పరమేశ్వరన్, దర్శకుడు అంజలి మీనన్ లాంటి వారు శైలజా టీచర్‌ను క్యాబినెట్ సభ్యునిగా తీసుకోవాలని కోరుతున్నారు.

  ఆమె అర్హురాలు

  ఆమె అర్హురాలు

  ట్విట్టర్‌లో కెకె శైలాజా టీచర్ ఫోటోను షేర్ చేసిన పార్వతి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శైలజా టీచర్ మంత్రివర్గంలో ఉండటానికి అర్హురాలని ఆమె పేర్కొంది. వైద్య, అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రానికి శైలజా నాయకత్వం వహించి వన్నె తెచ్చారని ఆమె పేర్కొన్నారు. అదేవిధంగా కేకే శైలజను కేరళ మంత్రివర్గం నుంచి తప్పించడంపై మాళవికా మోహనన్ కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీసుకున్న ఈ నిర్ణయం గురించి ఆమె ప్రశ్నించారు.

   నమ్మకం కావాలి

  నమ్మకం కావాలి

  అనుపమ పరమేశ్వరన్ కూడా కెకె శైలజ ఫ్యాన్ మేడ్ పోస్టర్ ఒక దానిని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. అలాగే ఆమెను కేరళ మంత్రివర్గానికి తీసుకురావాలన్న డిమాండ్‌కు ఆమె సంఘీభావం తెలిపారు. ఆమె హార్ట్ ఎమోజీతో పాటు #BringBackShailajaTeacher హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్ చేసింది. ఎక్కడైతే ఒక ఆశ ఒక నమ్మకం కావాలో అలాంటి చోట్ల శైలజ టీచర్ ఉండాలని, గొప్పగా పని చేసిన శైలజ టీచర్ ను మంత్రివర్గం నుంచి తప్పించడం అనేది పొరపాటు అని దర్శకురాలు అంజలి మీనన్ కూడా ట్వీట్ చేశారు.

  English summary
  Parvathy, Malavika Mohanan and Anupama Parameswaran took to Twitter to question Kerala Chief Minister Pinarayi Vijayan. former health minister KK Shailaja is not at all ministers now. The three actresses and some more celebrities criticised this move and tweeted with #BringBackShailajaTeacher and #BringOurTeacherBack hashtags.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X