స్టార్ హీరో ఇంట్లో తీవ్ర విషాదం.. పండుగకు ఒక్కరోజు ముందుగా అలా!
మలయాళ మెగాస్టార్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇప్పట్లో ఆయన తెలుగు సినిమాలు పెద్దగా చేయలేదు కానీ అప్పట్లో స్వాతి కిరణం సినిమాతో తెలుగు నటుడు అనిపించుకునేంతగా పాపులారిటీ సంపాదించుకున్నారు. అనంతరం సూర్య పుత్రులు, దళపతి సినిమాలతో మరింత క్రేజ్ తెచ్చుకున్నారు. ఇక ఆయన కుమారుడు దుల్కర్ సల్మాన్ కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. గతేడాది సీతా రామం మూవీతో తెలుగు ఆడియెన్స్ మనసు దోచుకున్నాడు. అయితే ఆయన ఇంట్లో తాజాగా విషాదం నెలకొంది.
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, ఆయన కొడుకు దుల్కర్ సల్మాన్ ఇద్దరూ వరుస సినిమాలతో సూపర్ బిజీగా ఉన్నారు. త్వరలో అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమాతో చాలా కాలం గ్యాప్ తర్వాత తెలుగులో అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు మమ్ముట్టి. ఇక ఆయన కుమారుడు దుల్కర్ సల్మాన్ కు తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉంది. మహానటి మూవీతో మంచి నటుడిగా ప్రూవ్ చేసుకున్న దుల్కర్ సల్మాన్ సీతా రామం సినిమాతో క్లాసిక్ హిట్ అందుకున్నాడు.

మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్ సినిమాల సంగతి పక్కన పెడితే తాజాగా వారి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పవిత్ర రంజాన్ పండుగకు ఒక్కరోజు ముందు మమ్ముట్టి తల్లి ఫాతిమా ఇస్మాయిల్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 93 ఏళ్ల ఫాతిమా కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మమ్ముట్టి తల్లి ఫాతిమా అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం నిర్వహించనున్నారు.

మమ్ముట్టి స్వగ్రామం అయిన కొట్టాయం సమీపంలోని చెంపులో ఫాతిమా అంత్యక్రియలు జరిపించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మమ్ముట్టి తల్లి మరణ వార్త తెలియడంతో మాలీవుడ్ సినీ ప్రముఖులు, పలువురు సంతాపం తెలియజేశారు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ట్విటర్ వేదికగా ప్రగాఢ సానుబూతి వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఫాతిమాకు ఆరుగురు పిల్లలు. ముగ్గురు కొడుకులు కాగా ముగ్గురు కూతుళ్లు. వారిలో మమ్ముట్టి పెద్దవాడు. రెండో కుమారుడు ఇబ్రహీం కూడా నటుడిగా రాణిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











