ఆ హీరోతో సినిమా తీస్తే.. సూసైడ్ చేసుకోవాల్సిందే.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు

మలయాళం స్టార్ హీరో ఉన్ని ముకుందన్ నటించిన గెట్ సెట్ బేబీ చిత్రం ఫిబ్రవరి 21వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు ముస్తాబవుతున్నది. అయితే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే భారీ అంచనాలు పెంచింది. మార్కో సినిమా తర్వాత ఈ మూవీ వస్తుండటంతో అందరిలోను ఆసక్తిని పెంచింది. అయితే ఈ సినిమా రిలీజ్ ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత చేసిన వ్యాఖ్యలు సెన్సేషన్‌గా మారింది. ప్రొడ్యూసర్ సామ్ జార్జ్ అబ్రహం చేసిన వ్యాఖ్యల వివరాల్లోకి వెళితే..

గెట్ సెట్ బేబీ సినిమా షూటింగు సమయంలో అనేక సమస్యలను ఎదుర్కొన్నది. ఓ దశలో మూవీ కంప్లీట్ అవుతుందా? లేదా అనే డౌట్ క్రియేట్ అయింది. ఆ సమయంలో హీరో ఉన్ని ముకుందన్ అందించిన సహకారం మరువలేనిది. ఆయన ఈ సినిమాకు అన్ని రకాలుగా అండగా నిలిచారు. ఆయన చేసిన మేలు మరువలేనిది అంటూ ఆయన ఎమోషనల్ అయ్యారు.

Malayalam Producer Sam George Abraham sensational comments on Unni Mukundan s behaviour and Get Set Baby

అయితే గెట్ సెట్ బేబీ సినిమాలో హీరోగా ఉన్ని ముకుందన్ అనుకొన్న సమయంలో సినిమా పరిశ్రమకు చెందిన చాలా మంది నన్ను భయపెట్టారు. ఆయనను హీరోగా తీసుకోవద్దని హెచ్చరించారు. అతడిని తీసుకొంటే సినిమా అనేక నష్టాలకు గురి అవుతుంది. ఉన్ని తీసుకొంటే నీవు సూసైడ్ చేసుకోనే పరిస్థితి ఎదురువుతుందని భయపెట్టారు అని సామ్ జార్జ్ తెలిపారు.

కానీ సినీ వర్గాలు భయపెట్టిన విధానికి భిన్నంగా ఉన్ని ముకుందన్ వ్యవహరించారు. ఆయనతో పనిచేయడం గొప్ప అనుభూతి. నా కెరీర్‌లో ఎవరూ అందించిన సహకారం ఆయన అందించారు. కొందరి మాటలు వింటే నేను ఆయనతో పనిచేసే గొప్ప అవకాశాన్ని కోల్పోయే వాడినని ఆ తర్వాత నాకు అర్ధమైంది. ఇలా కష్ట సమయంలో నాకు అండగా నిలిచిన ఉన్ని ముకుందన్‌కు థ్యాంక్స్ అని నిర్మాత అభిప్రాయపడ్డారు.

Malayalam Producer Sam George Abraham sensational comments on Unni Mukundan s behaviour and Get Set Baby

మలయాళ సినిమా పరిశ్రమలో విపత్కర పరిస్థితులు నెలకొని ఉన్నాయి. నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల మధ్య రెమ్యునరేషన్ల గొడవలు కొనసాగుతున్న సమయంలో నిర్మాత సామ్ జార్జ్ అబ్రహం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అత్యంత ప్రాధాన్యం చేకూరింది. కోలీవుడ్‌లో ఆర్థిక సమస్యల కారణంగా ఇండస్ట్రీలో సమ్మెకు సిద్దమవుతున్నది. షూటింగులను, ఈవెంట్లను రద్దు చేస్తూ ఇండస్ట్రీ నిర్ణయం తీసుకొన్నది.

ఇదిలా ఉండగా, గెట్ సెట్ బేబీ సినిమాలో ఉన్ని ముకుందన్ గైనకాలజిస్టుగా నటించారు. ఈ సినిమా ఫన్, ఎమోషన్స్, ఫన్, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, అలాగే మంచి కథ, కథనాలతో కంటెంట్ బేస్డ్ సినిమాగా రూపొందింది. ఈ చిత్రం ప్రమోషన్స్‌ ఊపందుకోవడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్కో తర్వాత ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

More from Filmibeat

Read more about: unni mukundan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X