మరో మాలీవుడ్ సెన్సేషన్ టాలీవుడ్‌కు.. మ్యాజిక్ రీపిట్ చేసేందుకు రెడీ
మలయాళ సినిమాలు ఎంతగానో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటాయి. జాతీయ అవార్డులను అందుకుంటూ దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతూ ఉంటాయి. అక్కడి నేటివిటీని ప్రధానంగా చేసుకుని సినిమాలు తెరకెక్కించడంతో అందర్నీ ఆకట్టుకుంటాయి.
అందుకే మాలీవుడ్ సినిమాలు అన్ని భాషల ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. అక్కడి ప్రేమమ్ చిత్రాన్ని మన ప్రేక్షకులు ఎంతగా మెచ్చారో అందరికీ తెలిసిందే. ఆ చిత్రాన్ని మనవాళ్లు ఇక్కడ రీమేక్ చేసినా.. అ మ్యాజిక్‌ను మళ్లీ క్రియేట్ చేయలేకపోయారు. ఒరిజినల్‌లో ఉన్న ఫీల్‌ను క్యారీ చేయలేకపోయారని అందరూ నిరుత్సాహపడ్డారు.

మనవాళ్లు మరో రీమేక్‌పై కన్నేశారు. ఈ ఏడాది వచ్చిన ఇష్క్.. ఘన విజయం సాధించింది. లవ్ అండ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ అక్కడ సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ చిత్రాన్ని తెలుగులో ఓ పెద్ద బ్యానర్ నిర్మించేందుకు సిద్దమైనట్లు సమాచారం. కొచ్చి నేపథ్యంలో జరిగే ఈ స్టోరీ.. ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌గా మన ముందుకు రాబోతోంది.మరి ఇందులో హీరోగా ఎవరు నటించనున్నారు? మిగతా వివరాలు త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
షేన్ నిగమ్, అన్ శీతల్ నటించిన ఈ చిత్రాన్ని రతీష్ రవి రచించగా.. అనురాజ్ మనోహర్ తెరకెక్కించాడు. ముఖేష్ ఆర్ మెహతా, అనూప్, సారథి ఈ సినిమాను నిర్మించారు. మాలీవుడ్ సంచలనం జేక్స్ బెజోయ్ సంగీతాన్ని అందించాడు.


Click it and Unblock the Notifications











