మోహన్ లాల్‌కు తీవ్ర అస్వస్థత.. హాస్పిటల్‌లో చేరిక.. అనారోగ్యానికి కారణం ఏమిటంటే?
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హుటాహుటిన స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంపై ఆయన అభిమానులు దిగ్బ్రాంతికి గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఆయన ఎలాంటి అనారోగ్యానికి గురయ్యారనే వివరాల్లోకి వెళితే..
విలక్షణ నటుడు మోహన్ లాల్ కొద్ది రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. దాంతో ఆయన ఆరోగ్య పరిస్థితి బలహీనంగా మారింది. అంతేకాకుండా ఆదివారం ఉదయం శ్వాస సంబంధింత సమస్యలు తలెత్తడంతో వెంటనే హాస్పిటల్‌లో చేర్పించారు.

మోహన్ లాల్‌ను కొచ్చిలోని అమృతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనెన్స్‌లో వైద్య చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. వైద్యులు తాజాగా ఆయన ఆరోగ్యంపై మెడికల్ బులెటిన్ రిలీజ్ చేశారు.
మోహన్ లాల్ (64) తీవ్రమైన జ్వరంతో బాధపడుతు్నారు. శ్వాస తీసుకోవడం తీవ్రమైన సమస్యగా మారింది. వైద్య పరీక్షల్లో మైలేజియాను గుర్తించారు. ఆయన వైరల్ ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యారు. కనీసం 5 రోజుల విశ్రాంతి అవసరం అని డాక్టర్ గిరీష్ కుమార్ బులెటిన్‌లో తెలిపాు.


Click it and Unblock the Notifications











