For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

షకీలా లవ్ లెటర్: నిర్మాత రిప్లై ఇచ్చాడు, ఏం జరిగిందంటే..

|

దక్షిణాది సినీ ఇండస్ట్రీని 90ల్లో తన శృంగార చిత్రాలతో ఓ ఊపు ఊపిన తార షకీలా. అప్పట్లో ఆమె సినిమా వస్తుందంటే స్టార్ హీరోలు సైతం తమ సినిమాలను వాయిదా వేసుకునే పరిస్థితి ఉండేది. ఇండస్ట్రీలో తన హవా కొనసాగిన రోజుల్లో ఎంతో మంది మనసు దోచిన షకీలా హృదయాన్ని కూడా ఓ నటుడు, నిర్మాత దోచేశాడట.

ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయం చెప్పుకొచ్చారు. మలయాళ నటుడు, ర్మాత మనియన్‌పిల్ల రాజును షకీలా ప్రేమించిందట. తన మనసులోని ప్రేమను వ్యక్తీకరిస్తూ లవ్ లెటర్ కూడా పంపినట్లు ఆమె వెల్లడించారు.

మోహన్ లాల్ మూవీ సమయంలో

మోహన్ లాల్ మూవీ సమయంలో

మోహన్ లాల్ హీరోగా రూపొందిన ‘చోటా ముంబై' సినిమాను మనియన్‌పిల్ల రాజు నిర్మించారు. ఈ సినిమాలో ఓ పాత్ర పోషించిన షకీలా అతడిపై మోజు పెంచుకుంది. ఈ క్రమంలోనే తన మనసులోని మాటను చెబుతూ లవ్ లెటర్ రాసిందట.

డబ్బు సాయం చేశాడు

డబ్బు సాయం చేశాడు

ఈ సినిమా షూటింగ్ సమయంలో షకీలా తల్లి అనారోగ్యానికి గురైంది. అప్పుడు డబ్బు అవసరం పడటంతో నిర్మాత రాజును సహాయం కోరిందట. ఇంకా అప్పటికీ షకీలా షూటింగ్ పార్ట్ కూడా పూర్తికాలేదు. అయినప్పటికీ డబ్బు సహాయం చేయడంతో అతడి మంచి తనం చూసి షకీలాకు ఇష్టం, ప్రేమ పెరిగిందట.

రిప్లై ఇవ్వలేదు

రిప్లై ఇవ్వలేదు

అప్పటి నుంచే మనియన్‌పిల్ల రాజును షకీలా ప్రేమించడం మొదలు పెట్టింది. అతడికి లవ్ లెటర్ రాసిన రాజు నుంచి మాత్రం ఎలాంటి రిప్లై రాలేదట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అతడు షకీలా లవ్ లెటర్ మీద ఎందుకు స్పందించలేదు అనేది తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో రాజు స్పందించారు.

ఎట్టకేలకు స్పందించిన నిర్మాత

ఎట్టకేలకు స్పందించిన నిర్మాత

‘‘షకీలా తల్లి అనారోగ్యంతో ఆసుపత్రి పాలవ్వడంతో నేను డబ్బు సాయం చేసిన మాట నిజమే. అయితే ఆమె నన్ను ప్రేమించిన విషయం మాత్రం నాకు తెలియదు. షకీలా తన సొంత వెహికిల్‌లో షూటింగుకు వచ్చేది. షూటింగ్ పూర్తవ్వగానే తిరిగి వెళ్లిపోయేది. ఆవిడ నుంచి నేను ఎలాంటి ప్రేమ లేఖ అందుకోలేదు' అని మనియన్‌పిల్ల రాజు స్పష్టం చేశారు.

English summary
"Yes, I had given money when Shakeela's mother was admitted to a hospital. But I was not aware of the fact that she loved me. She used to come to the shooting spot in her own vehicle, and after completing the filming, she used to go in the same vehicle. To be very clear about this affair, I have not received any love letters or kind of romantic requests from the actress," Maniyanpilla Raju clarified.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more