పబ్లిక్‌గా నడుం పట్టుకుని.. హీరోయిన్ మంజు వారియర్‌తో ఆకతాయిల పైశాచికం
ఆడది అర్దరాత్రి ఒంటరిగా నడిస్తేనే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వస్తుందని జాతిపిత మహాత్మా గాంధీ చెప్పేవారు. కానీ అర్ధరాత్రి కాదు కదా పబ్లిక్‌గానే స్త్రీలు ధైర్యంగా నడవలేకపోతున్నారు. తినేసే చూపులతో కళ్లతోనే అత్యాచారం చేసే వారి మధ్యలో మహిళలు ప్రయాణం సాగించాల్సి వస్తోంది. ఎప్పుడు? ఎవరు? ఎటు వైపు నుంచి వచ్చి కాటేస్తాడో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు. సామాన్యులే కాదు సెలబ్రెటీలది అదే పరిస్ధితి. తాజాగా ఆకతాయిల కారణంగా తీవ్ర ఇబ్బంది పడ్డారు మలయాళ నటి మంజూ వారియర్. ఈ వివరాల్లోకి వెళితే..
రోడ్డెక్కాలంటే వణికిపోతున్న మహిళలు
పని ప్రదేశాల్లో, పబ్లిక్‌లో మహిళలు నడవలేకపోతున్నారు. ఆకతాయిల కారణంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అసభ్యంగా తాకుతూ, గుచ్చిగుచ్చి చూపులతో పోకిరిలు రెచ్చిపోతుండటంతో ఆడవాళ్లు బయటికి రావాలంటేనే బయటికి రాలేకపోతున్నారు. బయటే కాదు ఇంట్లోనూ ఆడవాళ్లకి రక్షణ లేకుండా పోతోంది. ఎవరి చూపుల్లో ఏం అర్ధం ఉందో? ఎవరు ఎలా కాటేస్తాడోనని వణికిపోతున్నారు. ఇక చిత్ర పరిశ్రమలోని వేధింపుల పర్వం గురించి ఎంత చెప్పినా తక్కువే.

సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ భూతం
సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపుల గురించి రోజుకొకరు బాంబు పేలుస్తూ కలకలం రేపుతున్నారు. నటీనటుల ఎఫైర్స్, చీకటి వ్యవహారాలు ఇప్పటివి కావు. నటీనటుల మధ్య బంధాలపై బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచి గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. మీ టూ ఉద్యమంతో పాటు గతేడాది జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ చిత్ర పరిశ్రమలో మహిళా నటులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వేధింపుల గురించి బయటపెట్టింది. హీరోలు, దర్శక నిర్మాతలు, చివరికి అసిస్టెంట్స్ నుంచి కూడా తాము వేధింపులు ఎదుర్కొన్నట్లు హీరోయిన్స్ తెలిపారు.
హీరోయిన్లతో పోకిరిగాళ్ల చిల్లరి చేష్టలు
భారతదేశంలో నటీనటులను దేవుళ్లతో సమానంగా పూజిస్తారు అభిమానులు. అయితే ఇదంతా నాణేనికి ఓ వైపు మాత్రమే.. కొందరు ఆకతాయిలు బహిరంగ ప్రదేశాల్లో నటీనటుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తుంటారు. వారి శరీర భాగాలను టచ్ చేయాలని చూడటం, అసభ్యంగా తాకడంతో పాటు విలువైన వస్తువులను కొట్టేసేందుకు కొందరు కాచుకుని కూర్చొంటారు. అందుకే పబ్లిక్‌లోకి రావడానికి నటీనటులు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటూ ఉంటారు. కొద్దిరోజుల క్రితం యంగ్ హీరోయిన్ శ్రీలీలను కొందరు ఆకతాయిలు చేయి పట్టుకుని గుంపులోకి లాక్కెళ్లిపోయారు. భద్రతా సిబ్బంది వెంటనే స్పందించి ఆమెను క్షేమంగా పక్కకి తీసుకొచ్చారు. తాజాగా మలయాళ నటి మంజు వారియర్‌తో ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తించారు.
బెంగళూరుకు మంజు వారియర్
మలయాళ స్టార్ హీరోయిన్‌లలో ఒకరైన మంజు వారియర్ దాదాపు 30 ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల విడుదలై 2, వెట్టైయాన్, ఎంపురాన్ 2 సినిమాలలో కనిపించారు. వెట్టైయాన్‌లో ఆమె వేసిన స్టెప్ దేశాన్ని ఊపేసింది. 50కి చేరువ అవుతున్నా చెక్కు చెదరని అందంతో అమ్మాయిలకు పోటీ ఇస్తున్నారు మంజు వారియర్. బెంగళూరులోని ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు వచ్చారు. ఆమె వస్తున్న విషయం తెలుసుకున్న అభిమానులు భారీగా పోటెత్తారు.
మంజు వారియర్ నడుము గిల్లిన ఆకతాయి
మంజు కార్యక్రమం ముగించుకుని తిరిగి వెళ్తుండగా అభిమానులు చుట్టుముట్టారు. ఇంతలో ఓ వ్యక్తి ఆమె నడుమును గిల్లగా , మరికొందరు ఆమె ఛాతి భాగాన్ని టచ్ చేసేందుకు యత్నించారు. దీంతో వణికిపోయిన మంజు వారియర్ కొందరికి సెల్ఫీలు ఇచ్చి వెంటనే వెళ్లిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు ఘాటుగా కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











