Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
స్టార్ హీరోయిన్‌కు చేదు అనుభవం.. ఇంటి ముందు ధర్నా.. మాట తప్పినందుకు..!
పబ్లిసిటీ కోసం ఆచరణకు నోచుకోని హామీలిస్తే రాజకీయ నేతలైనా, లేదా సినీ తారలైన ప్రజా ఆగ్రహానికి గురికాకతప్పదనే విషయం మరోసారి రుజువైంది. మలయాళ స్టార్ మంజు వారియర్ మాట తప్పడంతో చేదు అనుభవాన్ని రుచిచూడక తప్పలేదు. వందలాది మంది గ్రామస్థులు హీరోయిన్ ఇంటి ముందు ధర్నా తీసుకోవడంతో మీడియాలో పరువు పోయింది. అసలేం జరిగిందంటే..

మంజు వారియర్ హామీ ఇవ్వడం
పేదవారిని ఆదుకోవాలన్న తాపత్రయంతో మంజు వారియర్ పక్కా ఇళ్లు కట్టిస్తానని మాట ఇచ్చారు. 18 నెలల క్రితం పరక్కుని కాలనీలోని వయనాద్‌లో జీవించే పేదలకు 57 ఏళ్లు కట్టిస్తానని చెప్పడంతో వారంతా సంబరపడ్డారు. మంజు వారియర్ ప్రభుత్వ అధికారులతో కూడా సంప్రదింపులు జరిపారు. ఎంతకు పనులు ప్రారంభం కాకపోవడంతో పేద ప్రజలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.

పనుల్లో కదలిక లేకపోవడంతో
మంజు వారియర్ కాలనీ నిర్మాణానికి సంబంధించిన డిజైన్, ప్లాన్ అంతా ప్రభుత్వ అధికారులకు సమర్పించారు. పనులు పూర్తి ఆరంభం కాకపోవడంతో అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం నుంచి సహాయం అందించాలని అభ్యర్థించారు. చివరకు ఎలాంటి కదలిక లేకపోవడంతో నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు.
దిలీప్ మాజీ భార్యతో ధనుష్ రొమాన్స్.. 40 ఏళ్ల వయసులో హీరోయిన్గా!

ఫిబ్రవరి 13న ఇంటి ముందు ధర్నా
మంజు వారియర్ మాట చెల్లుబాటు కాకపోవడంతో బాధితులు ఇటీవల మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ధర్నాకు పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 13వ తేదీన మంజు వారియర్ ఇంటి ముందు ధర్నా చేపట్టనున్నామని ప్రజలు హెచ్చరించారు. త్రిచూరులోని మంజు ఇంటి ముందు ధర్నా నిర్వహిస్తామని చెప్పారు.

లుసిఫెర్ రిలీజ్‌కు సిద్ధం
మంజు వారియర్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె నటించిన లుసిఫెర్ చిత్రం రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. సూపర్‌స్టార్ మోహన్‌లాల్ హీరోగా నటిస్తున్నారు. వివేక్ ఒబేరాయ్, కళాభవన్ షాజహాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది.

సురేష్ గోపి దానగుణానికి..
ఇదిలా ఉండగా, మలయాళ సూపర్‌స్టార్ సురేష్ గోపి ఇటీవల ఓ కుటుంబానికి ఇళ్లు కట్టి ఇచ్చారు. స్వయంగా ఆ ఇంటి గృహప్రవేశానికి హాజరయ్యారు. ఆ ఇంటికి సంబంధించిన ఇంటి తాళాలను కూడా వారికి అందజేశారు. సురేష్ గోపి చేసిన పనికి కేరళ వ్యాప్తంగా మంచి స్పందన లభించింది.