షూటింగ్‌లో గాయపడిన మంజు వారియర్!
మలయాళీ నటి మంజు వారియర్ షూటింగ్‌లో గాయపడ్డారు. మలయాళీ స్టార్ హీరో దిలీప్ కు మంజు వారియర్ మాజీ భార్య. ఆమె ప్రస్తుతం సంతోష్ శివన్ తెరకెక్కిస్తున్న జాక్ అండ్ జిల్ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో మంజు వారియర్ కు స్వల్ప గాయమైనట్లు తెలుస్తోంది.
వెంటనే చిత్ర యూనిట్ ఆమెని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.మంజు వారియర్, హీరో జయరాం ఈ చిత్రంలో జంటగా నటిస్తున్నారు. మంజు గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తరువాత షూటింగ్ తిరిగి ప్రారంభిస్తారట. ఈ మేరకు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఆమె నుదుటి భాగంలో అయిన గాయానికి వైద్యులు కుట్లు వేసి చికిత్స చేశారు.

ఇదిలా ఉండగా మంజు వారియర్ తన మాజీ భర్త దిలీప్ నుంచి 2016లో విడిపోయింది. వీరిద్దరికి మీనాక్షి అనే కుమార్తె సంతానం. మంజు నుంచి విడిపోయాక దిలీప్.. కావ్య మాధవన్ ని వివాహం చేసుకున్నాడు. ఇటీవలే వీరిద్దరికి పాప కూడా జన్మించిన సంగతి తెలిసిందే. దిలీప్ ప్రస్తుతం మలయాళీ నటిపై లైంగికంగా దాడి చేసిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.


Click it and Unblock the Notifications











