అపార్ట్‌మెంట్‌లో నాపై దారుణంగా.. మంజుమ్మెల్ బాయ్స్ దర్శకుడిపై హీరోయిన్ కేసు
మలయాళంతోపాటు దక్షిణాదిలో సంచలనం విజయం సాధించిన మంజుమ్మెల్ బాయ్స్ చిత్ర దర్శకుడు చిదంబరంపై లైంగిక వేధింపుల కేసు బుక్ చేశారు. తన లైంగికంగా వేధించారనే ఆరోపణలతో ఎర్నాకులం టౌన్ సౌత్ పోలీస్ స్టేషన్‌లో ఓ హీరోయిన్ ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదును స్వీకరించి కేసు బుక్ చేసినట్టు పోలీసులు ధృవీకరించారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్న ప్రకారం.. 2022 సంవత్సరంలో కోచిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో లైంగిక వేధించాడు. ఈ సంఘటన గురించిన వివరాలు బయటపెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించారు. దాంతో ఆ విషయాన్ని నేను బయటకు చెప్పలేకపోయాను. కానీ ఇప్పుడు ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేశానని తెలిపినట్టు సమాచారం.

అయితే నటి ఫిర్యాదు చేసిన విషయం నిజమే. మార్చి 2వ తేదీన తాము కేసు నమోదు చేశాం. బీఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశాం. ఫిర్యాదుకు అనుగుణంగా లైంగిక వేధింపుల, అఘాయిత్యం కేసు కింద సెక్షన్లు బుక్ చేస్తాం. బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది.
తాజా సమాచారం ప్రకారం మంజుమ్మెల్ బాయ్స్ దర్శకుడు చిదంబరంపై భారతీయ న్యాయ సంహిత చట్టం ప్రకారం సెక్షన్ 74, సెక్షన్ 75 ప్రకారం కేసు నమోదు చేసినట్టు సమాచారం. త్వరలోనే దర్శకుడిని విచారించేందుకు న్యాయ నిపుణులను సంప్రదించి నిర్ణయాలు తీసుకొంటున్నారని తెలిసింది.
మలయాళం ఇండస్ట్రీలో సంచలనం రేపిన ఈ కేసులో బాధితురాలి పేరును గోప్యంగా ఉంచారు. చట్ట నిబంధనల ప్రకారం నటి వివరాలను బయటకు వెల్లడించడానికి నిరాకరించారు. గతేడాది మీటూ ఉద్యమంపై కమిటీ నియమించిన తర్వాత ఇలాంటి ఆరోపణలు రావడం ఇటీవల కాలం మొదటిసారి. అయితే ఈ కేసుపై దర్శకుడి ఎలా స్పందిస్తారనే విషయంపై మీడియా వేచి చూస్తున్నది.


Click it and Unblock the Notifications











