సీక్రెట్‌గా మంజుమ్మల్ బాయ్స్ హీరో పెళ్లి .. గుట్టు చప్పుడుగా యంగ్ హీరోయిన్‌తో వివాహం

మలయాళ హీరో, హీరోయిన్లు అపర్ణాదాస్, మంజుమ్మల్ బాయ్స్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన దీపక్ పరాంబల్ సీక్రెట్‌గా మ్యారేజ్ చేసుకొన్నారు. ప్రైవేట్ కార్యక్రమంగా జరిగిన ఈ పెళ్లికి అతికొద్ది మంది స్నేహితులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ప్రస్తుతం వారి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పెళ్లికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

హీరోయన్ అపర్ణ దాస్ విషయానికి వస్తే.. ఇళయదళపతి వి.య్ నటించిన బీస్ట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇక మంజుమ్మల్ బాయ్స్ సినిమాతో హిట్టు సాధింంచిన దీపక్ కొద్దికాలంగా ప్రేమించుకొంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం మలయాళ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Manjummel Boys Fame deepak Parambol tie the Knot with Actress Aparna Das secretly at Guruvayur temple in Kerala

దీపక్, అపర్ణదాస్ ఇద్దరు మనోహరం మూవీ షూటింగులో ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఫాహద్ ఫాజిల్ నిర్మించిన ఈ సినిమా షూట్‌లో వారిద్దరూ ప్రేమల పడ్డారు. చివరకు కలిసి జీవించాలని నిర్ణయం తీసుకొన్నారు. దాంతో వీరిద్దరూ ఏప్రిల్ 24వ తేదీన గుట్టు చప్పుడు కాకుండా వివాహం చేసుకొన్నారు అని మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

కుటుంబ సభ్యులు, స్నేహితులు షేర్ చేసిన ఫోటోలతో అపర్ణ, దీపక్ వివాహం కేరళలోని గురువాయూర్ ఆలయంలో జరిగింది. ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతుండటంతో సినీ వర్గాలు, అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య పెళ్లి జరిగిందని తెలిసింది.

పెళ్లి వార్త బయటకు రాగానే అపర్ణాదాస్, దీపక్ పరాంబల్ అధికారికంగా మీడియాకు ఫోటోలు రిలీజ్ చేశారు. సంప్రదాయ దుస్తుల్లో మెడలో దండలతో కనిపించి అభిమానులకు ఆనందాన్ని పంచారు. వారిద్దరి మెడలో కేరళ సంప్రదాయ పద్దతుల్లో తయారు చేసిన దండలు కనిపించాయి. ఈ ఫోటోలు ప్రస్తుతం ట్రెండింగ్ అవుతూ విస్తృతంగా ప్రచారం జరుగుతున్నాయి.

దీపక్ పరాంబల్ విషయానికి వస్తే.. వినీత్ శ్రీనివాసన్ దర్వకత్వం వహించిన మలర్‌వాడీ ఆర్ట్స్ క్లబ్ సినిమా ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల రిలీజై సంచలన విజయం సాధించిన మంజుమ్మల్ బాయ్స్ సినిమాతో ప్రశంసలు అందుకొన్నాడు. ఇక అపర్ణ దాస్ ఫాహద్ ఫాజిల్ నిర్మించిన జాన్ ప్రకాశన్ అనే సినిమాతో మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X