లిప్‌లాక్స్‌కు ఫోర్స్ చేస్తున్నారు.. రొమాంటిక్ సీన్లపై వైలెంట్ హీరో కంగారు!
ఈ మధ్య కాలంలో ఇండియన్ సినిమా దగ్గర కంటెంట్ అండ్ క్వాలిటీ ఏ రేంజ్ లో మారిందో అందరికీ తెలిసిందే. అయితే ఇండియన్ సినిమా దగ్గర ఉన్న అన్ని జానర్స్ లో ప్రతీది మరింతగా డెవలప్ అవుతూ వస్తుంది. అయితే ఒక్క వైలెన్స్, యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో మాత్రం ఇంకా మనవాళ్ళు ఆ సహజత్వాన్ని చూపించలేకపోతున్నారు.
చాలా మంది టాప్ దర్శకులు కూడా ఈ వైలెంట్ కాన్సెప్ట్ ని కొంచెం లిమిటెడ్ గా ఆర్టిఫీషియల్ గానే ప్రెజెంట్ చేస్తున్నారు. దీనితో హాలీవుడ్ దగ్గర లాంటి సినిమాలు మన దగ్గర కష్టమే అని చాలా మంది అనుకున్నారు కానీ అప్పుడు బాలీవుడ్ నుంచి వచ్చిన "కిల్" అనే సినిమా వైలెన్స్ ని యాక్షన్ ని చాలా పద్దతిగా చూపించి హాలీవుడ్ వాళ్లే మన సినిమాని రీమేక్ చేసేందుకు కొనుక్కున్నారు.

దీనితో ఇండియన్ సినిమా దగ్గర ఇదే వైలెంట్ సినిమా అనుకుంటే దీనికంటే వైలెంట్ సినిమాగా మలయాళ సినిమా మార్కో వచ్చింది. కాగా ఈ సినిమాలో యంగ్ హీరో ఉన్ని ముకుందన్ హాట్ టాపిక్ గా మారాడు. అయితే ఉన్ని ముకుందన్ అప్పుడు వరకు చాలా తెలుగు సినిమాల్లో కూడా కనిపించాడు కానీ తన నుంచి ఈ రేంజ్ స్టఫ్ ని ఎవరు ఊహించలేదు.
చాలా స్టైలిష్ గా వైలెంట్ యాక్షన్ చేస్తాడని ఎవరు అనుకోలేదు కూడా.. కాగా ఈ యంగ్ హీరోనే ఇపుడు వైలెంట్ సీన్స్ కాదు రొమాంటిక్ సీన్స్ కి ఇపుడు నో అంటున్నాడు. మెయిన్ గా లిప్ కిస్ సీన్స్, హీరోయిన్స్ తో ఇంటిమేట్ సీన్స్ అయితే అసలే చెయ్యను అని చెబుతున్నాడు. సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ అన్నిటికీ నేను మొదటి నుంచీ వ్యతిరేకమే అని రివీల్ చేసాడు.
కాగా దీనిపై ఇంట్రెస్టింగ్ వివరణ కూడా తన దగ్గర ఉంది. ఒక హీరో హీరోయిన్ మధ్య రొమాన్స్ చూపించాలి అంటే ముద్దులు పెట్టుకోవడాలు లాంటి వాటితోనే కాదు వేరే రకంగా కూడా చూపించవచ్చు అని ఈ హీరో అంటున్నాడు. నా సినిమాలు ఎప్పుడూ అందరూ ఆడియెన్స్ కంఫర్టబుల్ గా చూడాలి అనుకోవాలని కోరుకుంటాను అందుకే ఆ తరహా సన్నివేశాలు చేయను అని చెబుతున్నాడట.
దీనితో ఈ వైలెంట్ హీరో కామెంట్స్ ఇపుడు వైరల్ గా మారాయి. అయితే ఇదొక్కటే కాదు తనని చాలా మంది దర్శకులు, నిర్మాతలు, పలు పలు సినిమాల్లో సీన్స్ ని చూపించి మీరు కూడా ఇలా చెయ్యండి అని ఫోర్స్ కూడా చేసేవారట. కానీ ఆ అన్నిటికి కూడా తాను నో చెప్పేసేవాడిని అని తెలిపాడు.
మరి ఈ రోజుల్లో హీరోయిన్స్ తో రొమాన్స్ వద్దు అనుకోవడం అనేది ఒక ఇంట్రెస్టింగ్ అంశమే అని చెప్పాలి. ఈరోజుల్లో సమయం దొరికితే బోల్డ్ సీన్స్ చెయ్యాలని అనుకునే హీరోలే ఎక్కువ కనిపిస్తున్నారు కానీ ఇలాంటి హీరోలే కనిపించడం లేదని నెటిజన్స్ అంటున్నారు. మొత్తానికి మార్కో హీరో మాత్రం మంచి మార్కులే కొట్టేశాడని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











