లైంగికంగా వేధించాడు: మరో సినీ కీచకుడి భాగోతం బట్టబయలు!

#మీటూ ఉద్యమం మరో సినీ ప్రముఖుడి నీచమైన బుద్దిని బయట పెట్టింది. సినిమా ఇండస్ట్రీలో మహిళలపై లైంగిక వేధింపుల పర్వం ఏ స్థాయిలో ఉందో మరోసారి తేటతెల్లమైంది. తాజాగా మలయాళ ఇండస్ట్రీకి చెందిన ప్రఖ్యాత నటుడు సిద్దిఖీ మీద సెక్సువల్ హరాస్మెంట్ ఆరోపణలు తెరపైకి వచ్చాయి.

మలయాళ నటి రేవతి సంపత్ తాజాగా తన ఫేస్ బుక్ పేజీ ద్వారా సిద్ధిఖీ బండారాన్ని బట్టబయలు చేసింది. 2016లో ఓ సినిమా స్క్రీనింగ్ సందర్భంగా సిద్ధిఖీ తనను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు చేశారు. 21 ఏళ్ల వయసులో తాను ఈ వేధింపులకు గురైనట్లు తెలిపారు.

తీవ్ర మానసిక వేదనకు గురయ్యా

తీవ్ర మానసిక వేదనకు గురయ్యా

‘సుఖమాయిరికటే' అనే చిత్రం 2016లో విడుదలైంది. త్రివేండ్రంలోని నీలా థియేటర్లో ఈ మూవీ స్క్రీనింగ్ సమయంలో సిద్ధికీ తన పట్ల సెక్సువల్ మిస్ బిహేవ్ చేశాడని రేవతి ఆరోపించారు. అతడి ప్రవర్తన వల్ల 21 ఏళ్ల వయసులో తాను తీవ్రమైన మానసిక వేదనకు గురైనట్లు తెలిపారు. అతడి వల్ల తన మనసుకు తగిలిన గాయం ఇప్పటికీ బాధిస్తూనే ఉందని ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించారు.

అతడికి నా వయసున్న కూతురు కూడా ఉంది

అతడికి నా వయసున్న కూతురు కూడా ఉంది

సిద్ధిఖీకి తన వయసు గల కూతురు ఉందని.... ఇలాంటి వ్యక్తుల వల్ల కూతుళ్లకు కూడా సరైన భద్రత ఉండకపోవచ్చని రేవతి వ్యాఖ్యానించారు. మలయాళ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వారి ఆట కట్టించేందుకు ఏర్పడిన సంస్థ ‘ఉమెన్ ఇన్ కలెక్టివ్ సినిమా(డబ్ల్యు‌సిసి) సైతం రేవతి ఇష్యూతో సిద్ధిఖీని టార్గెట్ చేసింది.

మంచితనం మసుగులో ఎందరో కీచకులు

మంచితనం మసుగులో ఎందరో కీచకులు

మలయాళం సినీ ఇండస్ట్రీలో మంచి వారిగా ముసుగు వేసున్న ఎందరో కీచకులు ఉన్నారని, వారంతా ప్రజల ముందు జెంటిల్మెన్‌గా ఫోజులు కొడుతున్నారని, ఏదో ఒక రోజు అలాంటి వారి పాపం పండుతుందని రేవతి సంపత్ వ్యాఖ్యానించారు. సిద్ధికీ వివాదం మలయాళ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

పబ్లిసిటీ కోసమే అంటూ...

లైంగిక వేధింపుల విషయాలను బయట పెట్టినపుడు... కొందరు నెగెటివ్‌గా స్పందించడం సర్వసాధారణమే. ఇపుడు రేవతి సంపత్ విషయంలో కూడా ఇలాంటి కామెంట్సే వినిపిస్తున్నాయి. ఆమె కేవలం పబ్లిసిటీ కోసమే సిద్ధిఖీ మీద ఇలాంటి ఆరోపణలు చేస్తోందని కొందరు నెటిజన్లు మండి పడుతున్నారు. రెండేళ్ల తర్వాత సిద్ధిఖీ వేధింపులు గుర్తుకు వచ్చాయా? అంటూ ట్రోల్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X