నా ఫ్లాట్‌కు వస్తావా? కౌగిలిలో బంధించి ముద్దులు.. సెక్రెటేరియట్‌లోనే నటిపై యాక్టర్ లైంగిక దాడి
మలయాళ సినీ పరిశ్రమను క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. యువ తారలు ఒక్కొక్కరు బయటకు వచ్చి భయంకరమైన అనుభవాలను మీడియాతో షేర్ చేయడం సంచలనంగా మారుతున్నది. సినీ అవకాశాల కోసం ప్రయత్నించిన ఔత్సాహిక తారలు తమకు ఎదురైన లైంగిక వేధింపుల వ్యవహారం తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేస్తున్నది. తాజాగా మరో యువ నటి మీడియాకు చెప్పిన విషయాలు సంచలనం రేపాయి. ఆ వివరాల్లోకి వెళితే..
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దక్షిణాది నటిపై హీరో దిలీప్ అత్యాచారయత్నం, కిడ్నాప్ కేసు తర్వాత కేరళ ప్రభుత్వం హేమ కమిటీని నియమించింది. సినీ పరిశ్రమలో వేధింపులు, పడక గది సుఖం ఇస్తేనే అవకాశాలు, ఇతర సెక్స్ కుంభకోణాలను వెలికి తీయడానికి చాలా మంది నటీనటులను కలిసి రిపోర్ట్ రూపొందించింది.

ఇటీవల హేమ కమిటీ కేరళ ప్రభుత్వానికి రిపోర్టును అందజేసింది. అందులో మలయాళ సినీ పరిశ్రమలో దారుణమైన సంఘటనలు చోటుచేసుకొన్నాయి. చాలా మంది అమ్మాయిలు నిర్మాతలు, దర్శకుల వేధింపులకు గురి అవుతున్నారనే విషయాన్ని స్పష్టంగా చెప్పాయి. దాంతో ఈ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత ధైర్యంగా ఒక్కొక్కరు బయటకు వచ్చి తమ బాధతను ఏకరువు పెట్టారు.
తాజాగా నటి మిను మునీర్ మీడియాతో మాట్లాడుతూ.. అత్యంత హేయమైన విషయాలను వెల్లడించారు. ముఖేష్ అనే సినీ ప్రముఖుడు నాతో దారుణంగా వ్యవహరించారు. నాకు పడక గదిలో సుఖాన్ని అందిస్తేనే నేను నీకు అమ్మా సంఘంలో సభ్యత్వం ఇస్తానని ఆఫర్ ఇచ్చారు. కేవలం నాతోనే కాదు సభ్యులతో కూడా బెడ్ షేర్ చేసుకోవాలని చెప్పారు అని ఆమె మీడియాకు వెల్లడించారు.
ఇక తిరువనంతపురం సెక్రెటెరియట్‌లో దీ ఇనగొట్టు నోక్కియే సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు జయసూర్య అనే సినీ ప్రముఖుడు నాతో దారుణంగా ప్రవర్తించాడు. నాపై లైంగిక దాడి చేశాడు. నేను బాత్రూమ్‌కు వెళ్లి వస్తుండగా నన్ను బలవంతంగా తన కౌగిలిలో బంధించాడు. నన్ను వాటేసుకొని పెదవులపై ముద్దులు పెట్టాడు అని తెలిపాడు.

ఆ తర్వాత నా వెంటపడి నా కోరిక తీర్చుతావా? లేదా.. ఒకే చెబుతావా? నో అంటావా? నాకు తిరువనంతపురంలో ఫ్లాట్ ఉంది. నీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి రా. అక్కడ మనం కలిసి ఎంజాయ్ చేద్దామని అన్నాడు. దాంతో నేను ఆయన ప్రపోజల్‌ను రిజెక్ట్ చేశాను. అది నా తొలి సినిమా కావడంతో నేను భయపడి ఎవరికీ చెప్పలేదు అని ఆమె అన్నారు.


Click it and Unblock the Notifications











