బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీతో దర్శకత్వంలోకి దిగుతున్న సూపర్ స్టార్... వివరాలు ఇవే!
Recommended Video
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ త్వరలో దర్శకత్వంలోకి అడుగు పెడుతున్నట్లు కొన్ని రోజుల క్రితమే ప్రకటించిన సంగతి తెలిసిందే. 'బారోజ్' పేరుతో సినిమా చేయబోతున్నట్లు తెలిపారు. పోర్చుగల్ బ్యాక్ డ్రాప్‌తో ఈ సినిమా ఉంటుందని, వాస్కో డి గామా సంపదను రక్షించడానికి నియమింపబడిన వ్యక్తి కథతో ఈ సినిమా తీయబోతున్నట్లు వెల్లడించారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు వెల్లడిస్తూ... మోహన్ లాల్ తన ఫేస్ బుక్ పేజీ ద్వారా ఒక వీడియో విడుదల చేశారు. సినిమా థీమ్ ఏమిటి? ఎవరెవరు నటిస్తున్నారు? అనే విషయాలు ఈ వీడియోలో చెప్పుకొచ్చారు. ప్రముఖ స్పానిష్ యాక్టర్స్ పాజ్ వెగా, రాఫెల్ అమార్గో ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషించబోతున్నట్లు మోహన్ లాల్ తెలిపారు.

పాజ్ వెగా
ఇంటర్నేషనల్ ఫిల్మ్ సర్వ్యూట్‌లో పాజ్ వెగా ప్రముఖ నటిగా గుర్తింపు పొందారు. ఆమె ‘10 ఐటెమ్స్ ఆర్ లెస్', ‘ది స్పిరిట్', ‘ఏంజెల్ ఆఫ్ ఈవిల్' లాంటి చిత్రాల్లో నటించారు. ఆమె నటించిన హాలీవుడ్ మూవీ ‘రాంబో: లాస్ట్ బ్లడ్' విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో సిల్వెస్టర్ స్టోలెన్ లీడ్ రోల్ చేస్తున్నారు.

రాఫెల్ అమార్గో
రాఫెల్ అమార్గో పలు స్పానిష్ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించారు. ‘బారోజ్' మూవీలో ఆయన వాస్కో డి గామా పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. అతడి ప్రియురాలి పాత్రలో పాజ్ వేగా నటిస్తారని సమాచారం.

వాస్కో డి గామా
తన వీడియోలో ‘బారోజ్' మూవీ గురించి మోహన్ లాల్ మాట్లాడుతూ... చిల్డ్రన్స్ ఫాంటసీ జోనర్లో సినిమా ఉంటుందని, ఈ చిత్ర కథను జిజో పున్నూసే రాసినట్లు తెలిపారు. వాస్కో డి గామా కాలం నాటి పరిస్థితులను ఈ చిత్రంలో ఉన్నది ఉన్నట్లు చూపించబోతున్నట్లు చెప్పుకొచ్చారు.

బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ
‘బారోజ్' మూవీ మలయాళ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఏ సినిమాకు పెట్టనంత భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రాన్ని ఆంటోనీ పెరుంబవూర్ తన ఆశీర్వాద్ సినిమాస్ బేనర్లో నిర్మించబోతున్నారు. బడ్జెట్ ఎంత? అనేది త్వరలో వెల్లడించనున్నారు.


Click it and Unblock the Notifications











