అదిరిపోయేలా మోహన్‌లాల్ రెమ్యునరేషన్.. బిగ్‌బాస్ హోస్ట్‌గా టాప్.. నాగ్, కమల్‌కు ధీటుగా
దేశంలోనే అతి పెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్ మలయాళంలో అట్టహాసంగా ప్రారంభమైంది. సౌత్ సూపర్ స్టార్ మోహన్ లాల్ హోస్ట్‌గా బిగ్‌బాస్ మలయాళం 4 సీజన్ ఆరంభమై ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. అయితే హోస్ట్‌గా మోహన్‌లాల్ తీసుకొంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు సౌత్ టెలివిజన్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. మూడో సీజన్‌కు మోహన్‌లాల్ ఎంత తీసుకొంటున్నారంటే...

సరికొత్త ఫార్మాట్‌తో బిగ్‌బాస్
భారీ అంచనాల మధ్య బిగ్‌బాస్ మలయాళం 3 ప్రారంభమైంది. గత రెండు సీజన్లకు భిన్నంగా ఈ షో ప్రారంభం కానున్నదనేది తాజా వార్త. గత రెండు సీజన్లలో పాల్గొన్న కంటెస్టెంట్లు ప్రస్తుత సీజన్‌లో వైల్డ్ కార్డు ఎంట్రీగా ప్రవేశిస్తారనేది తాజాగా టాక్ నడుస్తున్నది.

ప్రత్యేకంగా మోహన్‌లాల్ క్యాస్టూమ్స్
ఇక గత రెండు సీజన్లకు హోస్ట్‌గా వ్యవహరించిన మోహన్‌లాల్ అత్యంత ఫార్మాల్‌గా వేదిక మీద కనిపించారు. ఫార్మల్ దుస్తులతోనే షోను నడిపించారు. అయితే ఈ షోకు ఉన్న ప్రేక్షకాదరణను దృష్టిలో పెట్టుకొని మోహన్‌లాల్ క్యాస్టూమ్స్‌ను మార్చాలని నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం. బొహెమియన్, జపానీస్ ఫ్యాషన్‌తో మోహన్‌లాల్‌కు దుస్తులు సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది.

భారీగా రెమ్యునరేషన్ డిమాండ్
మలయాళ సినీ పరిశ్రమలో విశేషంగా పాపులారిటీ ఉన్న హీరో మోహన్‌లాల్ అని చెప్పడానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఆయనకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దానిని దృష్టిలో పెట్టుకొని మోహన్‌లాల్ భారీగా పారితోషికాన్ని డిమాండ్ చేశారట. అందుకు బిగ్‌బాస్ నిర్వాహకులు భారీగా రెమ్యునరేషన్ ముట్టజెప్పేందుకు సిద్ధమయ్యారు.

గత రెండు సీజన్లకు పారితోషికం ఇలా
బిగ్‌బాస్ మలయాళం 2 సీజన్‌లో మోహన్‌లాల్‌కు భారీగా రెమ్యునరేషన్ ముట్టజెప్పారనేది అందరికి తెలిసిందే. గత రెండు సీజన్లకు దాదాపు 12 కోట్ల రూపాయలను ఆయనకు పారితోషికంగా అందించినట్టు సమాచారం. అయితే ఈ మొత్తం మలయాళ టెలివిజన్ ఇండస్ట్రీలోనే అత్యధికం, ఓ రికార్డు అని చెప్పుకొన్నారు.

మోహన్‌లాల్‌కు సౌత్‌లోనే రికార్డు రెమ్యునరేషన్
మలయాళ మీడియా రిపోర్టుల ప్రకారం.. బిగ్‌బాస్ సీజన్ 3కి మోహన్‌లాల్ తీసుకొంటున్న రెమ్యునరేషన్ 18 కోట్ల రూపాయలు. ఇది సౌత్‌లోనే టాప్ అని చెప్పుకొంటున్నారు. టెలివిజన్ రంగంలో హోస్ట్‌గా ఈ మొత్తం రికార్డు స్థాయి అనే విషయాన్ని పేర్కొంటున్నారు. తెలుగులో నాగార్జున, తమిళంలో కమల్ హాసన్, కన్నడలో కిచ్చ సుదీప్‌కు ధీటుగా మోహన్‌లాల్ రెమ్యునరేషన్ తీసుకొంటున్నట్టు తెలిసింది.


Click it and Unblock the Notifications











