Mohanlal: ‘అమ్మ’కు షాకిచ్చిన స్టార్ హీరో.. మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్‌కు రాజీనామా
భారతదేశంలోని అన్ని సినిమా ఇండస్ట్రీల కంటే మలయాళ పరిశ్రమ వరుసగా భారీ స్థాయిలో హిట్లు మీద హిట్లను అందుకుంటూ ఫుల్ జోష్‌తో దూసుకుపోతోంది. ఈ మధ్య కాలంలోనే ఈ ఇండస్ట్రీ నుంచి ఎన్నో భారీ బ్లాక్ బస్టర్ మూవీలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే ఆ ఇండస్ట్రీలో కలకలం రేగింది. మలయాళ సినిమా రంగంలో మహిళలు ఎదుర్కొంటోన్న ఇబ్బందికర పరిస్థితులపై జస్టిస్ హేమ కమిటీ సిద్ధం చేసిన రిపోర్ట్ సంచలనం అవుతోంది. అప్పటి నుంచి ఆ పరిశ్రమలో ఎన్నో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మలయాళ సినీ రంగానికి చెందిన ఎంతో మంది నటీమణులు బయటకు వచ్చి చాలా మంది ప్రముఖులపై ఆరోపణలు చేస్తున్నారు. దీంతో ఇటీవలే అసోషియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్ (AMMA) నుంచి జనరల్ సెక్రెటరీ సిద్దిఖీ తప్పుకున్నారు. ఆ తర్వాత కూడా ఈ ఆరోపణలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇలా ఇటీవలే జాయింట్ సెక్రెటరీ బాబు రాజ్‌పై కూడా ఆరోపణలు వచ్చాయి. ఫలితంగా ఇప్పుడు మలయాళ సినిమా రంగంలో పెను ప్రకంపనలు కనిపిస్తున్నాయి.

మలయాళ సినిమా రంగంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అసోషియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్ (AMMA) ప్రెసిడెంట్ పదవికి స్టార్ హీరో మోహన్‌లాల్ రాజీనామా చేశారు. అంతేకాదు, ఆయన పాటు కార్యవర్గంలో ఉన్న 17 మంది సభ్యులు కూడా అసోషియేషన్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. ఈ వ్యవహారంతో మాలీవుడ్‌లో మరో సంచలనం చోటు చేసుకుంది. ఇక, కార్యవర్గంలో ప్రెసిడెంట్‌తో పాటు సభ్యులు రాజీనామా చేయడంతో ప్రస్తుత పాలకమండలి రద్దు అయిపోయింది.
ఇదిలా ఉండగా.. అసోషియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్ (AMMA) కూడా రెండు వర్గాలుగా ఏర్పడినట్లు ఇప్పటికే స్పష్టం అయింది. అదే సమయంలో ఇప్పుడున్న పాలక మండలిలోని జాయింట్ సెక్రెటరీ బాబు రాజ్‌ను పదవి నుంచి తొలగించాలని అందులోని చాలా మంది సభ్యులే డిమాండ్లను వినిపించారు. ఇలా ఎన్నో ఊహించని పరిణామాల నడుమ మోహన్‌లాల్ సారథ్యంలోని కార్యవర్గం రద్దు అయిపోయింది. మరో రెండు నెలల వ్యవధిలో కొత్త పాలక మండలి ఎంపిక ఉంటుందని తెలిసింది.


Click it and Unblock the Notifications











