ట్రైలర్ వచ్చేసింది: సూపర్ స్టార్ లుక్ చూస్తే ఆశ్చర్యపోతారు
మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్‌గా హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'ఒడియన్'. గత కొన్ని నెలలుగా అభిమానులు ఎదురు చూస్తున్న ఈ మూవీ ట్రైలర్ నేడు విడుదలైంది. మోహన్ లాల్ ఫేస్‌బుక్ పేజీ ద్వారా విడుదలైన ఈ ట్రైలర్లో సూపర్ స్టార్ లుక్ చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
మలయాళ సినీ పరిశ్రమ చరిత్రలో అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రమిది. హాలీవుడ్ స్టాండర్డ్స్‌తో దర్శకుడు విఏ శ్రీకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ట్రైలర్ చూస్తుంటే ఇదో రివేంజ్ డ్రామా అని తెలుస్తోంది.
ఇందులో మోహన్ లాల్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఒడియన్, మానిక్యన్ పాత్రల్లో ఆయన కనిపించబోతున్నాడు. మనుషులను జంతువుల రూపంలో దాచి పెట్టే ఒడి విద్య అనే మ్యాజిక్ ట్రిక్ ఇందులో చూపిస్తారని తెలుస్తోంది.

పలు కారణాలతో ఊరు విడిచి వెళ్లిన మానిక్యన్ ఒడియన్‌గా తిరిగి వచ్చి ఊరి మంచి కోసం ఏం చేశాడు అనే స్టోరీ లైన్ తో సినిమా నడిస్తుందని సమాచారం. మోహన్ లాల్ స్టైల్ మాస్ యాక్షన్‌తో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో సిద్ధిఖి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











