మీ టూ ఫ్యాషనైపోయింది.. హీరోయిన్లకు చురక.. వివాదంలో మోహన్ లాల్..
భారతీయ సినిమా పరిశ్రమను కుదిపేస్తున్న మీ టూ ఉద్యమంపై మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ నటులపై లైంగిక వేధింపులు చేస్తున్న హీరోయిన్లను ఉద్దేశించి దుబాయ్‌లో జరిగిన మీడియా సమావేశంలో పరోక్షంగా కామెంట్లు విసిరాడు. ఈ ఉద్యమంలో ఎంత వాస్తవం ఉందో తనకు తెలియడం లేదని, అది ఎక్కువ కాలం నిలవదనే అభిప్రాయాన్ని తాజా మీడియా సమావేశంలో వ్యక్తం చేశారు.
మలయాళ చిత్రం పరిశ్రమలో లైంగిక వేధింపుల్లాంటి ఎలాంటి సమస్యలు లేవు. వాస్తవంగా మీ టూ ఉద్యమం ఉందని కూడా భావించడం లేదు. లైంగిక వేధింపుల ఆరోపణలు అత్యుత్సాహంతో చేస్తున్నారు. ఇలా చేయడం కొందరికి ఫ్యాషన్‌గా మారింది. జీవితం చాలా చిన్నది. అలాంటి జీవితంలో లైంగిక వేధింపులనేవి ఎప్పుడో ఎక్కడో జరుగడం సహజమే. సినిమాలకే పరిమితం కాదు అని మోహన్ లాల్ అన్నారు.

నటుడు దిలీప్ వివాదం గురించి ప్రస్తావించగా.. మగవాళ్లు కూడా మీ టూ ఉద్యమం చేసే పరిస్థితులు లేకపోలేదు. అది మహిళలకే పరిమితం చేయవద్దు. ఒకరికి ఇలాంటి బాధ ఎదురైతే వాళ్లు కామెంట్ చేయాలి. నేను అలా కామెంట్ చేయలేను అని మోహన్ లాల్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











