Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
తెలుగు డైలాగ్‌తో అదరగొట్టిన మోహన్‌లాల్.. మలయాళ ఆరట్టు టీజర్ వైరల్
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన ఆరట్టు ట్రైలర్ య్యూటూబ్‌లో రికార్డు వ్యూస్ సాధిస్తున్నది. ఈ టీజర్ రెండు రోజుల్లోనే 20 లక్షల వ్యూస్ సాధించడం విశేషంగా మారింది. రెండు రోజుల క్రితం రిలీజైన ఆరట్టు టీజర్‌కు మంచి స్పందన లభిస్తున్నది. ఈ చిత్రానికి ఉన్నికృష్ణన్ బీ దర్శకత్వం వహించగా, సాజీష్ మంజేరీ, ఆర్డీ ఇల్ల్యూమినేషన్స్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకు ఉదయకృష్ణ మాటల రాశారు. రాహుల్ రాజ్ మ్యూజిక్, విజయ్ ఉలగనాథ్ సినిమాటోగ్రఫిని అందించారు.
ఆరట్టు ట్రైలర్ పూర్తిగా యాక్షన్ పార్ట్‌తో నిండిపోయింది. 50 సెకన్ల నిడివి ఉన్న టీజర్‌లోని యాక్షన్ సీన్లలో మోహన్‌లాల్ విజృంభించారు. మాస్ ఎలిమెంట్లతో మరోసారి లూసిఫర్ సినిమాను తలపించారు.
ఆరట్టు టీజర్లో మోహన్‌లాల్ నోట తెలుగు డైలాగ్స్ పలికించడం హాట్ టాపిక్‌గా మారింది. నేను వాడిని చంపేస్తాను అంటూ మోహన్‌లాల్ చెప్పిన డైలాగ్స్ పవర్‌ఫుల్‌గా పేలింది. మలయాళ టీజర్ మొత్తంలో ఒకే ఒక తెలుగు డైలాగ్ ఉండటం గమనార్హం.
ఆరట్టు చిత్రంలో శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్గా నటిస్తున్నారు. నెడుముడి వేణు, సాయికుమార్, సిద్దిఖీ, విజయ్ రాఘవన్, ఇంద్రాన్స్, జానీ ఆంటోని, షీలా, రచనా నారాయణ్కుట్టి, స్వాసిక తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 12వ తేదీన థియేటర్లో రిలీజ్ కానున్నది.