బాక్సింగ్ ఛాంపియన్‌గా మోహన్ లాల్.. లూసిఫర్ సీక్వెల్‌కు సూపర్‌స్టార్ రెడీ
జాతీయ అవార్డు అందుకొన్న మరక్కర్ అరబికడలింతే సింహం చిత్రం తర్వాత మలయాళ చిత్ర పరిశ్రమలో మరోసారి సూపర్ స్టార్ మోహన్ లాల్, ప్రియదర్శన్ క్రేజీ కాంబినేషన్ మరో సంచలన చిత్రం రాబోతున్నది. త్వరలోనే స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రియదర్శన్ దర్శకత్వం వహించే చిత్రంలో మోహన్ లాల్ బాక్సింగ్ చాంఫియన్‌గా కనిపించబోతున్నారు. ఈ సినిమా కోసం వచ్చే ఏడాది బాక్సింగ్ శిక్షణ పొందబోతున్నారు.
వాస్తవానికి నిజ జీవితంలో మోహన్ లాల్ కుస్తీ పోటీలో విజేతగా నిలిచిన క్రీడాకారుడు. 1977, 1978లో రెజ్లింగ్ పోటీల్లో కేరళ స్టేట్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ సాధించారు. ప్రస్తుతం వెండితెరపై మోహన్ లాల్‌ను బాక్సర్‌గా చూసేందుకు ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉండగా, మోహన్ లాల్ దర్శకుడిగా మారిసంచలన చిత్రాన్ని రూపొందిస్తున్నారు. బరోజ్ అనే చిత్రాన్ని ఇప్పటికే సెట్స్‌పైకి తీసుకెళ్లారు. అలాగే ఆయన నటించిన ఆరట్టు చిత్రం రిలీజ్‌కు సిద్దమైంది.
అలాగే త్వరలోనే లూసిఫర్ చిత్రానికి రీమేక్‌గా రాబోతున్నది. ఎంపరన్ అనే చిత్రం లూసిఫర్ చిత్రానికి సీక్వెల్‌ను పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించనున్నారు. ఈ చిత్రం 202లో సెట్స్‌పైకి వెళ్లనున్నది.


Click it and Unblock the Notifications











