దర్శకుడిగా మారిన మోహన్ లాల్.. ఎమోషనల్ స్టోరీతో.. అమితాబ్ ఏమన్నారంటే...

వెండితెరపై ఎన్నో విలక్షణ పాత్రలతో విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన సూపర్‌స్టార్ మోహన్‌లాల్ సరికొత్త అవతారంలో కనిపించబోతున్నారు. దశాబ్దాలుగా నటుడిగా రాణించిన ఆయన దర్శకుడిగా మారడానికి సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా పలువురు సినీ నటులు ఆయనకు అభినందనలు తెలియజేస్తూ...

నిష్‌విక నాయుడు బ్యూటీఫుల్ ఫోటోలు.. అందంతో సందడి చేసిన యువ హీరోయిన్

 దర్శకుడిగా మారుతున్నానంటూ

దర్శకుడిగా మారుతున్నానంటూ

డిఫరెంట్ రోల్స్‌తో సిల్వర్ స్క్రీన్‌పై బిజీగా ఉన్న సమయంలో మోహన్ లాల్ కీలక నిర్ణయం తీసుకొన్నారు. 2019లో తాను డైరెక్షన్ చేయబోతున్నానంటూ ప్రకటించగానే అభిమానులు, సన్నిహితులు సంతోషంలో మునిగిపోయారు. ఈ క్రమంలో లాక్‌డౌన్ రావడంతో దర్శకుడిగా మారడానికి కాస్త ఆలస్యం అయింది.

సెట్స్‌పైకి బరోజ్ మూవీ

సెట్స్‌పైకి బరోజ్ మూవీ

మోహన్ లాల్ దర్శకుడిగా తన తొలి చిత్రం బరోజ్‌ను బుధవారం (మార్చి 24) సెట్స్‌పైకి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. నా జీవిన ప్రయాణంలో నటుడిగా ఎన్నో అనుభూతులను కూడగట్టుకొన్నాను. సినిమా నాకు జీవితంగా, జీవనభృతిగా మారింది. ఈ క్రమంలో మరో అద్భుతమైన ప్రయాణాన్ని ప్రారంభించాను. దర్శకుడిగా బరోజ్ సినిమాను మార్చి 24న ప్రారంభిస్తున్నాను అంటూ వీడియోలో తెలిపారు.

సినీతారల ఫేవరేట్ విహార ప్రదేశాలు.. లవర్స్, భార్తలతో రొమాన్స్ చేసిన ప్లేసెస్

అమితాబ్ అభినందనలు

అమితాబ్ అభినందనలు


దర్శకుడిగా మారిన మోహన్ లాల్‌కు ట్విట్టర్ ద్వారా అమితాబ్ బచ్చన్ అభినందనలు తెలిపారు. తన అభినందనను మలయాళ భాషల్లో ట్వీట్ చేసి తన అభిమానాన్ని చాటుకొన్నారు. బరోజ్ సినిమా ద్వారా తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేబడుతున్న ది గ్రేట్ మోహన్‌లాల్‌కు అభినందనలు అంటూ అమితాబ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

బిగ్‌బీకి మోహన్‌లాల్ రెస్పాన్

బిగ్‌బీకి మోహన్‌లాల్ రెస్పాన్


అమితాబ్ బచ్చన్ ట్వీట్‌కు మోహన్ లాల్ స్పందించారు. సర్.. మీ అద్భుతమైన మెసేజ్‌కు నా ధన్యవాదలు. మీ ఆలోచనలు, సలహాలు నా హృదయంలో ఉంటాయి. మీ దీవెనలు ఎప్పుడూ నన్ను భావోద్వేగానికి గురిచేస్తాయి. మీపై తరగని అభిమానం, గౌరవం ఉంది అంటూ మోహన్ లాల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Recommended Video

Allu Arjun, Lalettan Mohanlal Combo In AA 21 | త్వరలో అధికారిక ప్రకటన!!
బరోజ్ సినిమా కథ ఇదే...

బరోజ్ సినిమా కథ ఇదే...


మోహన్ లాల్ తొలిసారి దర్శకత్వం వహిస్తున్న బరోజ్ సినిమా విషయానికి వస్తే ఆంగ్లేయుల పాలన నాటి కథతో తెరకెక్కుతున్నది. భారతదేశానికి వాస్కోడగామా వచ్చిన సమయంలో ఆయన సంపదను కాపాడే యోధుడి ఎమోషనల్ కథను తెరకెక్కిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X