twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మంత్రి పదవి ఆవిడకే ఇవ్వండి.. టీచరమ్మకి అండగా సినీ ఇండస్ట్రీ!

    |

    భారతదేశంలో మొట్టమొదటి కరోనా కేసు ఎక్కడ మొదలైంది అని ఎవరినైనా అడిగితే వెంటనే టక్కున కేరళ అని చెబుతారు. అయితే ఇప్పుడు మాత్రం అక్కడ పరిస్థితి అంత తీవ్రంగా లేదు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అక్కడ పరిస్థితి కాస్త కంట్రోల్ లోనే ఉంది. అయితే దానికి కారణం ఎవరు అని అడిగితే కచ్చితంగా శైలజ టీచర్ అని చెప్పక తప్పదు. శైలజ టీచర్ గా పేరు తెచ్చుకున్న కేకే శైలజ కేరళలో కరోనా కట్టడికి అవిశ్రాంతంగా పని చేశారు. గత టర్మ్ లో ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన ఆమె అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.

    అయితే కేరళలో తాజాగా రెండోసారి వరుసగా అధికారంలోకి వచ్చినా లెఫ్ట్ కూటమి మాత్రం ఇప్పుడు ఆమెకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఈనెల 20వ తేదీన కొలువుదీరనున్న కొత్త క్యాబినెట్ లో శైలజ చోటు దక్కలేదని కేరళ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నిజానికి గత కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన వారికి ఈసారి మంత్రి పదవులు ఇవ్వద్దని సిపిఎం పార్టీ నిర్ణయం తీసుకోవడంతో ఆమెకు మంత్రి పదవి దక్కలేదని అంటున్నారు. అయితే అనూహ్యంగా ఆమెకు మలయాళ సినిమా ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ లభిస్తోంది. ఇప్పటికే ఆమెకు మంత్రి పదవి ఇవ్వాలని చెబుతూ మలయాళ, తెలుగు సినిమాలలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ట్వీట్ చేశారు.

     Mollywood asking to Bring Back Shailaja Teacher

    అలాగే నటి రీమా కల్లింగాల్ కూడా ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించడం సరికాదని ఆమెకి ఆరోగ్య శాఖ మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. ఇక వీరిద్దరే కాక నటి పార్వతి కూడా ఆమెకు ఆరోగ్య మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. సితార కృష్ణ కుమార్ కూడా శైలజ టీచర్ కు మంత్రి పదవి ఇవ్వాల్సిందే అంటూ సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. నిజానికి ఆమె కృషిని ప్రపంచమంతా గుర్తించింది. దీంతో కేరళ ప్రజలు కూడా ఆమెకు కేరళ చరిత్రలోనే లేనంత భారీ మెజార్టీతో గెలిపించారు. సుమారు 60 వేల మెజార్టీతో ఆమెను గెలిపించుకున్నారు ఆమె నియోజకవర్గం ప్రజలు. రాజకీయాల్లోకి రాక ముందు ఆమె హై స్కూల్ టీచర్ గా పని చేసేవారు. దీంతో ఆమెకు టీచర్ అనే పేరు సుస్థిరం అయిపొయింది.

    English summary
    list for ministers for the next Kerala cabinet was announced earlier today. But Health Minister KK Shailaja was missing in the list. According to party decisions all the ministers worked in last term will not get minister posts this time. so Malayalam industry celebs too took to social media and started #bringbackshailajateacher’ trending.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X