నా మనసు దోచిన హీరో అతడే.. అతడితో ఎప్పుడైనా రెడీ.. నమిత హాట్ కామెంట్
దక్షిణాదిలో సూపర్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకొన్న నమితా పెళ్లి తర్వాత తన సినిమాలో వేగాన్ని పెంచింది. తనకు అత్యధిక పాపులారిటీ ఉన్న మలయాళంలో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు సిద్దమయ్యారు. బహుభాష చిత్రంగా రూపొందిన బొవ్ వావ్ అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా మారిన నమిత పలు మీడియా ఛానెళ్లు, ప్రముఖ దినపత్రికతో మాట్లాడుతున్నారు.
సాక్షి అగర్వాల్.. అమ్మాయి నడుమంటే ఇలా ఉండాలి
ఆ సందర్భంగా నమిత మాట్లాడుతూ.. మలయాళంలో మీకు ఇష్టమైన హీరో ఎవరు అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. నా మనసు దోచిన నటుడు, హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. ఆయనతో నటించడానికి అవకాశం వస్తే ముందు వెనుకా ఆలోచించను అంటూ నమిత తన మనసులోని మాటను బయటపెట్టారు.

ఇక బొవ్ వావ్ అనే చిత్రంలోని తన పాత్ర గురించి చెబుతూ.. ఇందులో కీలక పాత్రను పోషిస్తున్నాను. నా పాత్ర చుట్టే కథ కొనసాగుతుంది. ఓ బాధితురాలిని కాపాడేందుకు వచ్చిన దేవుడి చుట్టు ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమాను ఆర్ఎల్ రవి రచించి దర్శకత్వం వహించారు. వాస్తవ కథతో ఈ సినిమా తెరకెక్కుతున్నది. మలయాళం, తమిళం, ఇతర భాషల్లో రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని తెలిపారు.


Click it and Unblock the Notifications











