Akhanda గా మలయాళ సూపర్ స్టార్.. సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న అఘోరా పోస్టర్.. రీమేక్ న్యూస్ వైరల్!

నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన అఖండ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసుకొన్నది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులే కాకుండా ఇతర భాషలకు సంబంధించిన సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకొన్నది. అయితే హిందుత్వం, ఆలయాల పరీరక్షణ, పర్యావరణం, కుటుంబ విలువల్లాంటి అంశాలతో తెరకెక్కిన ఈ సినిమాపై భారీగానే చర్చ జరిగింది. అయితే కేరళలో ఈ సినిమాను చేస్తే బాగుంటుందని సురేష్ గోపి ఫోటోతో ఫ్యాన్స్ చేసిన పోస్టర్ ఇప్పుడు మాలీవుడ్‌లో కలకలం రేపుతున్నది. ఈ వివరాల్లోకి వెళితే..

100 కోట్ల రూపాయల గ్రాస్‌తో

100 కోట్ల రూపాయల గ్రాస్‌తో

అఖండ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. బాలకృష్ణ కెరీర్‌లోనే తొలి 100 కోట్ల చిత్రంగా రికార్డు సృష్టించింది. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను హిందుత్వ కాంక్షను రగిలించేలా ఓ ప్రేరణగా నిలిచింది. ఈ సినిమా రిలీజ్ తర్వాత బాలయ్యను అభిమానించని వారు కూడా అభిమానించడం విశేషంగా మారింది.

24 గంటల్లో ఒక మిలియన్ వ్యూస్

24 గంటల్లో ఒక మిలియన్ వ్యూస్

అలాగే ఇటీవల డిస్నీ+:హాట్‌స్టార్ ఓటీటీలో రిలీజైన అఖండ చిత్రం అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నది. దేశంలో ఇప్పటి వరకు ఏ హీరో సినిమాకు రాని ఘనత ఈ సినిమాకు దక్కింది. ఓటీటీలో రిలీజైన 24 గంటల్లోనే 10 లక్షల మంది ప్రేక్షకులు చూసిన రికార్డును ఈ సినిమా సొంతం చేసుకొన్నది. ఇలాంటి సినిమాపై కేరళలో చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ఆ చర్చలోకి వెళితే..

సురేష్ గోపి అఘోరా లుక్‌

సురేష్ గోపి అఘోరా లుక్‌

మలయాళ సూపర్ స్టార్ సురేష్ గోపి అభిమానులు మలయాళ నెటిజన్లు , అఖండ సినిమాను చూసి ఫిదా అయిపోయారు. వెంటనే బాలకృష్ణ ఫోటోను సురేష్ గోపి ఫోటోతో మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. ఆ లుక్ చూసిన ఫ్యాన్స్ ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో షేర్ చేసి మోత మోగించారు. దాంతో ఈ సినిమాపై మలయాళ సినిమా పరిశ్రమలో భారీ చర్చకు దారి తీసింది.

కేరళలో సురేష్ గోపి హిందుత్వ నినాదం

కేరళలో సురేష్ గోపి హిందుత్వ నినాదం

హిందుత్వ విలువలతో రూపొందిన అఖండ చిత్రాన్ని మలయాళంలో రీమేక్ చేయాలి. ఆ చిత్రంలో సురేష్ గోపి నటించాలి. కేరళలో హిందుత్వ విలువ గురించి చెప్పగలిగిన ఒకే హీరో సురేష్ గోపి అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. దాంతో ఈ సినిమా రీమేక్ చేస్తే ఎలా ఉంటుందనే ఐడియా ఇప్పుడు మలయాళ సినిమా వర్గాల్లో మెదులుతుందట.

Recommended Video

Akhanda Success Tour : Nandamuri Balakrishna, Boyapati Srinu హల్చల్
బీజేపీలో కొనసాగుతున్న సురేష్ గోపి

బీజేపీలో కొనసాగుతున్న సురేష్ గోపి

ఇక సురేష్ గోపి విషయానికి వస్తే.. ఇటీవల ఆయన బీజేపీలో చేరారు. మైనారిటీలు బలంగా, అలాగే లెఫ్ట్ ఫార్టీలు స్ట్రాంగ్‌గా ఉన్న రాష్ట్రంలో కాషాయ పార్టీ జెండాను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎప్పుడైతే సురేష్ గోపికి చెందిన అఖండ పోస్టర్‌‌ సోషల్ మీడియాలో వదిలారో అప్పటి నుంచి ఆయనపై కొందరు ప్రత్యర్థులు ట్రోలింగ్ కూడా మొదలుపెట్టారు. అయితే బాలకృష్ణ మాదిరిగానే సురేష్ గోపి కూడా అఘోరా పాత్రలో నటించే ధైర్యం చేస్తారా అనే ప్రశ్నలు ఇప్పుడు మీడియాలో మొదలయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X