Nayanathara: నన్ను కాల్చి చూడండి.. నయనతార షాకింగ్ కామెంట్స్
సినీ తారలు తమ అందానికి మెరుగులు దిద్దుకొనేందుకు రకరకాల సౌందర్య చిట్కాలు పాటిస్తుంటారు. కొందరైతే వయసు కనిపించకుండా సర్జరీలు చేసుకొని.. అభిమానులకు గ్లామర్ పంచేందుకు రెడీ అవుతుంటారు. అయితే అలా కాస్మోటిక్ సర్జీలు చేసుకొని కష్టాలు పడిన వారున్నారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే తన వయసుపై బడుతున్నా అది కనిపించకుండా ఉండటానికి నయనతార కాస్మోటిక్ సర్జరీ చేయించుకొన్నారనే విషయంపై మీడియాపై వస్తున్న వార్తలపై ఆమె ఘాటుగా స్పందించారు. ఆ చేసిన కామెంట్స్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..
నయనతార గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయం ఆమె సొంతం. గ్లామర్ తారగా కెరీర్ మొదలు పెట్టిన ఈ అందాల భామ అగ్రహీరోలతో కలిసి నటించడమే కాకుండా అభిమానులను మెప్పించారు. ఆమె దక్షిణాదిలోనే స్టార్ హీరోగా మారిపోయారు. ప్రస్తుతం అత్యధిక రెమ్యునరేషన్ తీసుకొనే హీరోయిన్లలో ఒకరిగా నిలిచారు.

హీరోల పక్కన గ్లామర్ హీరోయిన్ పాత్రలకు దూరమై..హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలను ఎంచుకొన్న తర్వాత నయనతార గ్రాఫ్ భారీగా పెరిగింది. ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. దాంతో లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్‌ను సొంతం చేసుకొన్నది. ఆమె డేట్స్ కోసం టాప్ హీరోలు ఎదురు చూసేలా చేశాయి.
అయితే తమిళ, మలయాళ మీడియాలో నయనతారపై కొన్ని రూమర్లు క్రియేట్ అయ్యాయి. ఆ వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. తన వయసు కనిపించకుండా ఉండేందుకు ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొన్నదనే వార్తలపై నయనతార కొద్దికాలంగా మౌనంగా ఉన్నప్పటికీ.. తాజాగా తప్పనిసరి పరిస్థితుల్లో స్పందించాల్సి వచ్చింది.
నయనతార ముఖానికి కాస్మొటిక్ సర్జరీ చేయించుకొన్నారు. అందుకే అందంగా కనిపిస్తున్నారు. తన కెరీర్‌ను కాపాడుకోవడానికి ఇలాంటి సర్జరీలు చేయించుకొంటున్నారు అనే వార్తలు విస్తృతంగా ట్రెండింగ్ అవుతున్నాయి. వాటిపై ఆమె స్పందిస్తూ.. ఇలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయో అర్ధం కాదు. వ్యక్తిగతంగా ఇలా టార్గెట్ చేయడం సరికాదు అని అన్నారు.

నా ముఖంలో కనిపించే మార్పులకు నా శరీరంలో జరిగే మార్పులే. నా బరువు పెరిగినప్పుడు తగ్గినప్పుడు ఫేస్‌లో మార్పులు కనిపిస్తాయి. అంతేకానీ నేను ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోలేదు. అలా ఎవరికైనా అనుమానం ఉంటే నన్ను గిచ్చి చూడండి.. అంతగా నమ్మకం లేకపోతే నన్ను కాల్చండి. అలా చేస్తే నాలో ప్లాస్టిక్ ఉందో లేదో తెలుస్తుంది. నేను ఎలాంటి సర్జరీలు చేసుకోలేదు. కేవలం ఫుడ్, డైట్‌ను మాత్రమే ఫాలో అవుతాను అని ఘాటుగా ట్రోలర్స్‌కు సమాధానం ఇచ్చారు.
నయనతార కెరీర్ విషయానికి వస్తే.. తాజాగా అన్నపూర్ణి: ది గాడెస్ ఆఫ్ ఫుడ్ చిత్రంలో నటించారు. ప్రస్తుతం ఆమె టెస్ట్, మన్నన్‌గట్టి సిన్స్ 1960 చిత్రాలు రిలీజ్‌కు సిద్దంగా ఉన్నాయి. డియర్ స్టూడెంట్స్, తని ఒరువన్ 2, ముక్తి అమ్మన్ 2 చిత్రాల్లో నటిస్తున్నారు. చేతి నిండా ప్రాజెక్టులతో ఆమె బిజీగా మారిపోయారు.


Click it and Unblock the Notifications











