విషాదంలో నయనతార.. లేడి సూపర్‌స్టార్ తండ్రి ఐసీయూలో...

దక్షిణాది స్టార్ హీరోయిన్, లేడి సూపర్ స్టార్ నయనతార విషాదంలో మునిగిపోయారు. ఆమె తండ్రి కురియన్ కొడియాట్టు తీవ్ర అనారోగ్యం బారిన పడటంతో కోచిలోని ప్రైవేట్ హాస్పిటల్‌లోని ఐసీయూలో చేర్పించారు. తండ్రి ఐసీయూలో చేరిన విషయం తెలియగానే హుటాహుటినా కోచికి ప్రయాణం అయ్యారు. ఒంటరిగా ఉన్న తన తల్లి ఓమనా కొడియట్టుకు అండగా ఉండి.. మానసిక స్థైర్యాన్ని నింపేందుకు ప్రయత్నిస్తున్నారు.

నయనతార తండ్రి కురియన్ గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం కుదుటపడకపోవడంతో నయనతార, ఆమె ప్రియుడు విఘ్నేష్ శివన్ ఇద్దరు ప్రత్యేక విమానంలో కోచికి వెళ్లి పరామర్శించారు. వైద్య పరీక్షల అనంతరం కాస్త ఆయన ఆరోగ్యం కుదుట పడటంతో ఆమె మళ్లీ చెన్నైకి తిరిగి వచ్చారు. ప్రస్తుతం మళ్లీ హాస్పిటల్ చేర్చడంతో మరోసారి కోచికి వెళ్లారు.

 Nayantharas father Kurian Kodiyattu hospitalised in Kochi

అయితే నయనతార సోదరుడు లెనో యూఏఈలో ఉంటున్నారు. తన తల్లిదండ్రులను చూసుకొనే వారు లేకపోవడంతో నయనతార కోచికి సమయం చిక్కినప్పుడల్లా వెళ్లి వస్తుంటారు,

నయనతార సినిమాల విషయానికి వస్తే.. ఆమె నటించిన నిహాల్ చిత్రం ఇటీవలే రిలీజ్ అయింది. ఆమె నటించిన నేత్రికన్, అన్నాతే చిత్రాల షూటింగ్ పూర్తి అయింది. త్వరలోనే రిలీజ్‌కు సిద్ధమైంది. అలాగే కాతు వాకులా రెండు కాదల్ చిత్రం సెట్స్‌పై ఉంది, ఆరడుగుల బుల్లెట్ చిత్రం విడుదల వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X