నిత్యా మీనన్‌పై నిర్మాతల బ్యాన్.. మా అమ్మకు మూడవ దశలో క్యాన్సర్, అందుకే నాపై కుట్ర!

తన నటనతోనే నిత్యామీనన్ సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా ఎదిగింది. నటనకు ప్రాధ్యానత ఉన్న పాత్రలు నిత్యామీనన్ ని వరిస్తుంటాయి. తెలుగులో అలా మొదలైంది చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన నిత్యామీనన్ ఆ తర్వాత ఇష్క్, గుండె జారీ గల్లంతయ్యిందే, జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ విజయాలు అందుకుంది. ఇదిలా ఉండగా నిత్యామీనన్ ప్రస్తుతం మలయాళం చిత్ర పరిశ్రమలో వివాదంలో చిక్కుకుంది. నిత్యామీనన్ పై మలయాళీ నిర్మాతలు బ్యాన్ విధించారు. దీనితో తాజగా నిత్యామీనన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ప్రవర్తన బాగలేదని

ప్రవర్తన బాగలేదని

కొంతమంది మలయాళీ నిర్మాతలు నిత్యామీనన్ పై ఆరోపణలు చేస్తున్నారు. నిత్యామీనన్ నిర్మాతలకు ఇవ్వాల్సిన కనీసం గౌరవం కూడా ఇవ్వకుండా తన అహంకారాన్ని ప్రదర్శిస్తోందని సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఎవరైనా నిర్మాత నటుడిని కలిస్తే బాగా రిసీవ్ చేసుకుని అతిథి మర్యాదలు చేస్తారు. కానీ సినీ నిర్మాతలమనే కనీస గౌరవం లేకుండా తనో పెద్ద స్టార్ అనుకుంటూ నిత్యామీనన్ ప్రవర్తన అభ్యంతరకరంగా ఉందని కొంతమంది నిర్మాతలు ఆరోపిస్తున్నారు.

నిత్యామీనన్‌పై బ్యాన్

నిత్యామీనన్‌పై బ్యాన్

ఇటీవల కొంతమంది నిర్మాతలు నిత్యామీనన్ ని కలవడానికి ప్రయత్నిస్తే వెనక్కు పంపేసినట్లు వార్తలు వస్తున్నాయి, దీనితో నిత్యామీనన్ పై ఆగ్రహంతో ఉన్న నిర్మాతలు ఆమెని మలయాళీ చిత్ర పరిశ్రమ నుంచి బ్యాన్ చేయాలని నిర్ణయించారు. చాలా చిన్న విషయం క్రమంగా వివాదంగా మారి ఈ స్థాయికి చేరుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వివాదంతో తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిత్యామీనన్ తొలిసారి స్పందించింది.

మూడవ దశ క్యాన్సర్

మూడవ దశ క్యాన్సర్

నిత్యామీనన్ మాట్లాడుతూ.. సదరు నిర్మాతలు తనని కలవడానికి వచ్చినప్పుడు నేను ఓ చిత్ర షూటింగ్ లో ఉన్నా. ఆ సమయంలో మా అమ్మకు 3వ దశలో క్యాన్సర్ ఉంది. ఆ బాధతో కనీసం నటనపై దృష్టి పెట్టె పరిస్థితిలో కూడా నేను లేను. అలాంటి సమయంలో నిర్మాతలు నన్ను కలవడానికి వచ్చారు. మా అమ్మకు అనారోగ్యం వలన నాకు మనఃశాంతి లేదు. చర్చలు జరిపే మూడ్ లేదు. వారితో కన్నీరు పెట్టుకుంటూ ఎలా మాట్లాడగలను అని నిత్యామీనన్ తెలిపింది.

నాపై కుట్ర

నాపై కుట్ర

నేనున్న పరిస్థితిని అర్థం చేసుకోకుండా నా గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. మలయాళీ చిత్ర పరిశ్రమలో తాను లేకుండా ఉండేందుకు కుట్ర చేస్తున్నారు అంటూ నిత్యామీనన్ తెలిపింది. కానీ నేను మాత్రం ఈ వివాదాలని పట్టించుకోను. నా పని నేను చేసుకుంటూ వెళతాను అని నిత్యామీనన్ క్లారిటీ ఇచ్చింది. నిత్యామీనన్ ఇచ్చిన క్లారిటీతో అయినా మలయాళీ నిర్మాతలు చల్లబడుతారో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X