ప్రియా వారియర్ తొక్కేసింది.. నా క్యారెక్టర్‌ను దెబ్బ తీసింది.. ఇక నటించను
Recommended Video

లవర్స్ డే (మలయాళంలో ఒరు ఆడార్ లవ్) టీజర్లో అందాల తార ప్రియా ప్రకాశ్ వారియర్ ఒక్కసారి కన్నుగీటి దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణ చూరగొనడమే కాకుండా ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయింది. నేషన్ సెన్సేషన్, వింక్ గర్ల్ అనే ట్యాగ్‌లతో సోషల్ మీడియాలో మోత మోగించింది. ఈ చిత్రంలో రోషన్ అబ్దుల్ రావూఫ్, నూరిన్ షరీఫ్ ప్రధానమైన పాత్రల్లో కనిపించారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇదిలా ఉంటే, ఆ చిత్రంలో మరో హీరోయిన్‌గా నటించిన నూరిన్ షరీఫ్.. ప్రియా వారియర్‌ను ఉద్దేశించి సెన్సేషనల్ కామెంట్లు చేశారు.

ఓవర్‌నైట్ స్టార్‌గా ప్రియా ప్రకాశ్ వారియర్
లవర్స్ డే చిత్రం కోసం తొలుత నూరీన్ షరీఫ్ మెయిన్ హీరోయిన్‌గా అనుకొన్నారు. ప్రియా కంటే నూరీన్ పాత్ర నిడివే ఎక్కువ. ప్రియా వారియర్ పాత్ర కంటే నూరిన్ పాత్ర చుట్టే కథ తిరిగేలా స్క్రిప్టు రూపొందించారు. అయితే కన్నుగీటిన సన్నివేశంతో ప్రియా వారియర్ దేశవ్యాప్తంగా స్టార్‌గా మారిపోయింది. దాంతో నూరీన్ పాత్రను దారుణంగా తగ్గించారు.

ప్రియా కోసం పాత్రను తగ్గించారు
ఒరు ఆడార్ రిలీజ్ తర్వాత నూరీన్ మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో ప్రియా వారియర్ సెన్సేషనల్‌గా మారిన తర్వాత నన్ను పక్కన పెట్టారు. ఆమె పాత్రను ఎలివేట్ చేసేలా స్క్రిప్టును మార్చారు. నా పాత్ర ప్రాధాన్యతను తగ్గించే సరికి నేను తీవ్ర నిరాశకు గురయ్యాను. లీడ్ రోల్ కాస్త సపోర్టింగ్ క్యారెక్టర్‌గా మారిపోయింది.

ప్రియా వారియర్‌తో ఇక నటించను
ఒరు ఆడార్ లవ్ చిత్ర హీరో రోషన్ అబ్దుల్‌తో నటించాల్సి వస్తే ఆనందంగా ఒప్పుకొంటాను. ప్రియా వారియర్‌తో నటించాల్సి వస్తే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాను. వీలైనంత వరకు ఒప్పుకోకుండానే ఉంటాను. ఎందుకంటే నా కెరీర్‌ను ఆమె గందరగోళంలో పడేసింది అని నూరీన్ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రియా వారియర్ క్రేజ్ కోసం
ప్రియా వారియర్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఒరు ఆడార్ లవ్ సినిమా కథను దర్శకుడు ఒమర్ లులు మార్చేశారు. క్లైమాక్స్ తప్ప మిగితా అంతా రీషూట్ చేశారు. విషాదకరంగా సినిమా ముగియడం ప్రేక్షకులను ఆకట్టుకోలేదు అనే వాదన వినిపించింది.


Click it and Unblock the Notifications











