యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ రజని.. ఇద్దరూ ఒకే సినిమా కోసం!

Recommended Video

jr NTR & Rajini Kanth Competes For Same Movie

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అరవింద సమేత చిత్రం రూపంలో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్నాడు. అరవింద సమేత చిత్రం 150 కోట్లకు పైగా గ్రాస్ తో దూసుకుపోతోంది. ఎన్టీఆర్ ఒక సినీ హీరోగా ఆల్ రౌండర్ అని చెప్పొచ్చు. నటన, నాట్యం, డైలాగ్ డెలివరీలో యంగ్ టైగర్ కు తిరుగులేదు. ఎన్టీఆర్ వాయిస్ గంభీరంగా ఉంటుంది. అందుకే మాస్ డైలాగ్స్ బాగా పేలుతాయి. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ రజనీ కాంత్ గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.

ఆసక్తి రేపుతున్న ఒడియాన్

ఆసక్తి రేపుతున్న ఒడియాన్

మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం ఒడియాన్. శ్రీకుమార్ మీనన్ దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ బడ్జెట్ లో నిర్మించబడింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత పెరిగేలా చేసింది. ఈ చిత్రంలో మోహన్ లాల్ విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు.

జంతు లక్షణాలతో

జంతు లక్షణాలతో

ఈ చిత్రంలో మోహన్ లాల్ జంతు లక్షణాలతో నటిస్తాడట. పగలు ఒకలా, రాత్రి ఒకలా ప్రవర్తించే ఛాలెంజింగ్ రోల్ లో మోహన్ లాల్ అద్భుతంగా నటించినట్లు తెలుస్తోంది. కేరళలో జరిగిన కొన్ని యధార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్ వాయిస్ ఓవర్

ఎన్టీఆర్ వాయిస్ ఓవర్

ఈ చిత్రాన్ని మలయాళ, తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. మళయాలంలో ఈ చిత్రానికి స్టార్ హీరో మమ్ముట్టి వాయిస్ ఓవర్ అందించనున్నారట. తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, తమిళంలో సూపర్ స్టార్ రజనీ ఒడియాన్ చిత్రానికి వాయిస్ ఓవర్ అందించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

 జనతా గ్యారేజ్ చిత్రంతో అనుబంధం

జనతా గ్యారేజ్ చిత్రంతో అనుబంధం

ఎన్టీఆర్, మోహన్ లాల్ మధ్య జనతా గ్యారేజ్ చిత్రంతో అనుబంధం ఏర్పడింది. మోహన్ లాల్, ఎన్టీఆర్ కలసి నటించిన జనతా గ్యారేజ్ చిత్రం మంచి విజయం సాధించింది. ఒడియాన్ చిత్రాన్ని త్వరలో విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X