మోహన్ లాల్ ‘ఒడియన్’ ట్విట్టర్ రివ్యూ... హైప్ చూస్తే అలా, టాక్ ఇలా ఉందేంటి?

Recommended Video

Odiyan Reviews: Mohanlal Film Failed To Impress Critics And Audience | Filmibeat

మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన 'ఒడియన్' చిత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళంలో విడుదలైంది. విఏ శ్రీకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వస్తోంది. మోహన్ లాల్ తన పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టినా దర్శకుడు శ్రీకుమార్ తన నేరేషన్‌తో మెప్పించలేక పోయాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఒడివిద్యా (చేతపడి లాంటిది)అనే కాన్సెప్ట్ చుట్టూ ఈ చిత్ర కథ తిరుగుతుంది. ఈ ప్రపంచంలొ ఆ విద్య తెలిసిన చివరి వ్యక్తి మాణిక్యన్ పాత్రలో మోహన్ లాల్ నటించారు. మంజు వారియర్, ప్రకాష్ రాజ్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రం ద్వారా విఏ శ్రీకుమార్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. మరి ప్రేక్షకులు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో చూద్దాం.

ఎబో యావరేజ్ ఫస్టాఫ్, బిలో యావరేజ్ సెకండాఫ్

ఎబో యావరేజ్ ఫస్టాఫ్, బిలో యావరేజ్ సెకండాఫ్

‘ఒడియన్' ఫస్టాఫ్ ఎబోయావరేజ్, సెకండాఫ్ బిలో యావరేజ్. బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. మోహన్ లాల్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. అయితే దర్శకుడి నేరేషన్ ఆకట్టుకోలేదు.

 థ్రిల్లయ్యే స్థాయిలో లేదు

థ్రిల్లయ్యే స్థాయిలో లేదు

సినిమా చాలా స్లోగా ఉంది. ఒడి సీన్లు ఆసక్తికరంగా ఉన్నాయి కానీ థ్రిల్లయ్యే స్థాయిలో లేవు.

పులిమురుగన్ స్థాయిలో లేదు

పులిమురుగన్ స్థాయిలో లేదు

‘ఒడియన్' చిత్రం పులిమురుగన్(మణ్యంపులి) స్థాయిలో లేదు. దర్శకుడు సినిమాను ఆస్తికరంగా తీయడంలో ఫెయిల్ అయ్యాడు.

స్టోరీలైన్ మిస్సైంది

స్టోరీలైన్ మిస్సైంది

ఫస్టాఫ్ యావరేజ్, సెకండాఫ్ బావుంది. క్లైమాక్స్ ఫైట్ సీన్ సూపర్. సినిమాలో మంచి స్టోరీలైన్ అనేది మిస్సైంది. మోహన్ లాల్ అదరగొట్టాడు. విఎఫ్ఎక్స్, సినిమాటోగ్రఫీ బావుంది. మంజు వారియర్ ఓకే.

స్లో మూవీ

స్లో మూవీ

స్లోగా రన్ అయ్యే ఫాంటసీ థ్రిల్లర్. చాలా సాగదీసినట్లు అనిపిస్తుంది. మోహన్ లాల్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే నచ్చుతుంది.

చాలా ఎక్స్ పెక్ట్ చేశాం

చాలా ఎక్స్ పెక్ట్ చేశాం

ఒడియన్ మూవీ ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే ఎమోషనల్‌గా ఉంది. స్లోగా, సాగదీసినట్లు ఉంది. అయితే పాటలు, క్లైమాక్స్ ఫైట్ బావుంది. కానీ ఇంతకంటే ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేశాం.

స్టోరీ బావుంది, డైరెక్షన్ బాగోలేదు

స్టోరీ బావుంది, డైరెక్షన్ బాగోలేదు

ఒడియన్ మూవీ కాస్త స్లోగా ఉంది. అంచనాలను అందుకోలేదు. స్టోరీ బావుంది కానీ దర్శకత్వం బాలేదు.

నిరాశ పరిచింది

నిరాశ పరిచింది

ఒడియన్ మూవీ పూర్తిగా నిరాశ పరిచింది. నో మాస్, నో క్లాస్... కేవలం హైప్. దర్శకుడి ఫెయిల్యూర్. ఫైట్స్ కూడా పులిమురుగన్ స్థాయిలో లేవు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X