twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రియా వారియర్‌పై డైరెక్టర్ ఫైర్.. టాలెంటెడ్ హీరోయిన్ కాదు.. ఆమె వల్ల డబ్బు పొయింది!

    |

    వింక్ గర్ల్, నేషన్ సెన్సేషన్ ప్రియా ప్రకాశ్ వారియర్ నటించిన లవర్స్ డే చిత్రం అంచనాలను తలకిందులు చేసింది. తెలుగు, మలయాళ భాషల్లో బడ్జెట్‌ను మించిన లాభాలను రాబట్టింది. అయితే కొన్ని విషయాలపై దర్శకుడు ఒమర్ లులు తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కడం మీడియాలో చర్చనీయాంశమైంది. ప్రియా వారియర్‌కు అవకాశం ఇవ్వడంపై దర్శకుడు మండిపడుతున్నారు. అసలేం జరిగిందంటే..

    ప్రియా వారియర్‌ది చిన్న పాత్ర

    ప్రియా వారియర్‌ది చిన్న పాత్ర

    వాస్తవానికి ప్రియా వారియర్‌ది లవర్స్ డే చిత్రంలో చాలా చిన్న పాత్ర. నౌరీన్ షరీఫ్‌ది మెయిన్ హీరోయిన్ రోల్. అయితే మలరాయ పూవీ పాట హిట్ కావడం, టీజర్‌ వైరల్‌గా మారడంతో ప్రియా వారియర్‌కు దేశవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. దాంతో ప్రియాను మెయిన్ హీరోయిన్ నాపై ఒత్తిడి తీసుకొచ్చాడు.

    నిర్మాతతో గొడవ పడ్డాను

    నిర్మాతతో గొడవ పడ్డాను

    ప్రియా వారియర్ కోసం కథను మార్చడానికి నేను ఒప్పుకోలేదు. దాంతో మా మధ్య గొడవలు జరిగాయి. గొడవల కారణంగా నాకు రెమ్యునరేషన్, డబ్బింగ్ రైట్స్ రావాల్సిన మొత్తం సరిగా ఇవ్వలేదు. ఏదో జరిగిందిలే అని నేను సర్దుకొన్నాను. దాని ఫలితం ప్రియా వారియర్ నాకు సరైన గౌరవాన్ని ఇవ్వలేదు.

    మన సినిమాల్లో సెక్స్‌ తప్పుగా చూపిస్తూ వచ్చారు: మహిళ డైరెక్టర్ ఆవేదనమన సినిమాల్లో సెక్స్‌ తప్పుగా చూపిస్తూ వచ్చారు: మహిళ డైరెక్టర్ ఆవేదన

     ప్రియా వారియర్‌తో చక్కటి గుణపాఠం

    ప్రియా వారియర్‌తో చక్కటి గుణపాఠం

    నిర్మాత కోసం నేను రాజీ పడి నూరీన్‌కు అన్యాయం చేస్తే.. ప్రియా వారియర్ నాకు గుణపాఠం నేర్పింది. సినిమా రిలీజ్ తర్వాత నుంచి ప్రియా వారియర్ నాకు టచ్‌లో లేకుండా పోయింది. ప్రియా వారియర్ తీరు నన్ను చాలా బాధించింది అని ఒమర్ లులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రియా వారియర్ కంటే నూరీన్ మంచి ప్రతిభ ఉన్న హీరోయిన్ అని అన్నారు.

    నేను కూడా కుంగిపోయాను

    నేను కూడా కుంగిపోయాను

    లవర్స్ డే సినిమాలో నా పాత్ర ప్రాధాన్యాన్ని తగ్గించడంతో నేను మానసికంగా చాలా కుంగిపోయాను. ప్రియా వారియర్‌కు ప్రిఫరెన్స్ ఇవ్వడం నాకు బాధకలిగించింది. ప్రియా వారియర్‌కు ఓవరనైట్‌లో హైప్ రావడంతో ఏం చేయలేకపోయాను. మానసిక వేదన గురయ్యాను అని నూరీన్ పేర్కొన్నారు.

    English summary
    Lovers day director Omar Lulu revealed that he was compelled to compromise the cinematic language of the film after the producer forced him to portray Priya Prakash Varrier as the female lead. The director also added that he is not in touch with Priya Prakash Varrier in any manner now.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X