Onam Releases: మలయాళంలో 4 చిత్రాల భారీ బాక్సాఫీస్ ఫైట్.. బరిలోకి మోహన్‌లాల్, ఫాహద్ ఫాజిల్ సినిమాలు
భారతీయ సినిమా రంగంలో ప్రస్తుతం మలయాళ సినిమాలకు మంచి ఆదరణ దక్కుతున్నది. కేవలం ఓటీటీలోనే కాకుండా థియేటర్‌లో కూడా భారీగా రెస్సాన్స్ లభిస్తున్నది. దక్షిణాదిలోనే కాకుండా ఉత్తర భారత దేశంలో కూడా మలయాళ చిత్రాలకు భారీగా ఆడియెన్స్ సెట్ అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో కేరళలో భారీగా సంబరాలు జరుపుకొనే ఓనమ్ పండుగను పురస్కరించుకొని ఏకంగా నాలుగు భారీ, స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీగా పోటీకి సిద్దమయ్యాయి. ఆ నాలుగు మాలీవుడ్ సినిమాల వివరాల్లోకి వెళితే..
ఓనమ్ పండుగ రిలీజులు
కేరళలో ప్రతిష్టాత్మకంగా జరుపుకొనే ఓనమ్ పండుగ నేపథ్యంలో ఆగస్టు 28, 29 తేదీలలో నాలుగు భారీ సినిమాలు రిలీజ్‌కు సిద్దమయ్యాయి. సూపర్ స్టార్ మోహన్ లాల్, స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్, యువ హీరోలు ప్రేమలు ఫేమ్ నస్లేన్, హిృదూ హరూన్ నటించిన సినిమాలు విడుదలకు ముస్తాబయ్యాయి. ఈ సినిమాలు క్రేజీగా ప్రమోషన్స్‌తో దూసుకెళ్తూ ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ సినిమాల గురించిన వివరాల్లోకి వెళితే..

మోహన్ లాల్ నటించిన హృదయపూర్వం
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన తాజా చిత్రం హృదయపూర్వం. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి సత్యన్ అంతికాడ్ దర్వకత్వం వహించారు. డైరెక్టర్ కుమారుడు అఖిల్ సత్యన్ రాసిన కథకు సోను టీపీ స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమాను ఆశ్వీరాద్ సినిమాస్ బ్యానర్‌పై అంటోని పెరంబవూర్ నిర్మించారు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, సంగీత్ ప్రతాప్, సంగీత మాధవన్ నాయర్, సిద్దిఖీ, లాలు అలెక్స్, జనార్ధన్, సబితా ఆనంద్, బాబురాజ్, నిషాన్, ఎస్పీ చరణ్ తదితరులు నటించారు. మీరా జాస్మిన్, బాసిల్ జోసెఫ్ అతిథి పాత్రల్లో కనిపిస్తారు. ఈ సినిమా సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. అను మోథేదాత్ సినిమాటోగ్రఫిని, కే రాజ్‌గోపాల్ ఎడిటింగ్, జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ బాధ్యతలను నిర్వహించారు. ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న ఈ చిత్రం ఓనమ్ పండుగ సందర్భంగా ఆగస్టు 28వ తేదీన రిలీజ్ అవుతున్నది.

దుల్కర్ సల్మాన్ నిర్మించిన లోక చాప్టర్ 1
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మాతగా మారి డొమినిక్ అరుణ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం లోక చాప్టర్ 1 చంద్ర. ఈ చిత్రంలో ప్రేమలు హీరో నస్లేన్, కల్యాణి ప్రియదర్శిని జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో నిశాంత్ సాగర్, రఘునాథ్ పాలేరి, విజయరాఘవన్ తదితరులు నటిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం, నిమిష్ రవి సినిమాటోగ్రఫి, చమన్ ఛాక్కో సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా 28 ఆగస్టున రిలీజ్ అవుతున్నది.

ఫాహద్ ఫాజిల్ నటించిన రొమాంటిక్ కామెడీ
స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్, కల్యాణి ప్రియదర్శిని జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం ఒడుమ్ కుతిరా చాడుమ్ కుతిరా. హూ లెట్ ది హార్స్ అవుట్ అనేది సినిమా సబ్ టైటిల్. ఈ సినిమాకు అల్తాఫ్ సలీమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రేవతి పిళ్లై, వినయ్ ఫోర్ట్, తదితరుటు నటిస్తున్నారు. ఈ సినిమాకు జింటో జార్జ్ సినిమాటోగ్రఫి, జస్టిన్ వర్గీస్ మ్యూజిక్, నిధిన్ రాజ్ అరోల్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 29వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది.

ప్రీతి ముకుందన్‌తో మైనే ప్యార్ కియా అంటున్న హరున్
మలయాళంలో యువ హీరో, హీరోయిన్లు హిృదూ హరూన్, ప్రీతి ముకుందన్ జంటగా రూపొందిన యాక్షన్, రొమాంటిక్, కామెడీ చిత్రం మైనే ప్యార్ కియా. ఈ సినిమాకు ఫైజల్ ఫాజిలూద్దీన్ దర్శకత్వం వహించారు. సంజూ ఉన్నతాన్ నిర్మాతగా వ్యవహరించారు. రెడిన్ కింగ్ల్సే, మైమ్ గోపి, జగదీష్ జనార్ధన్, ప్రిన్స్, జియో బేబీ తదితరులు నటించారు. ఈ సినిమాకు డాన్ పాల్ పీ సినిమాటోగ్రఫి, ఎలక్ట్రానిక్ కిలి , విజయ్ ఆనంద్ సంగీతం అందించారు. ఈ సినిమాకు కన్నన్ మోహన్ ఎడిటర్‌గా వ్యవహరించారు. ఈ సినిమా ఆగస్టు 29వ తేదీన రిలీజ్ అవుతున్నది.



Click it and Unblock the Notifications











