»   » సినీ నటి ఫొటోలు మార్ఫింగ్.. సోషల్ మీడియాలో లీక్.. నీచమైన చేష్టలు..

సినీ నటి ఫొటోలు మార్ఫింగ్.. సోషల్ మీడియాలో లీక్.. నీచమైన చేష్టలు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఓరు ఆధార్ లవ్ మూవీ విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అందులో నటించిన ప్రియా ప్రకాశ్ వారియర్ ఇప్పటికే దేశవ్యాప్తంగా సెలబ్రిటీగా మారడంతోపాటు వివాదంలోనూ చిక్కుకున్నది. ఓ వైపు వివాదం కొనసాగతుండగానే ఆ చిత్రంలో నటించిన మరో నటి వివాదంలో చిక్కుకున్నది. ఆ వివాదమేమింటంటే..

 జిప్సా బేగం ఫోటోలు మార్ఫింగ్

జిప్సా బేగం ఫోటోలు మార్ఫింగ్

ఓరు అధార్ లవ్ చిత్రంలో నటించిన జిప్సా బేగం అనే నటి ఫోటోలు మార్ఫింగ్‌కు గురయ్యాయి. అంతేకాకుండా వాటిని ఆన్‌లైన్‌లో లీక్ చేయడంతో వివాదంగా మారింది. అయితే అలాంటి నీచమైన చేష్టలు నన్ను బాధపెట్టవు అని జిప్సా స్పష్టం చేసింది.

నిందితులకు బుద్ధి చెప్పాలి

నిందితులకు బుద్ధి చెప్పాలి

సైబర్ క్రైమ్ బారిన పడిన వ్యక్తుల్లో నేనే మొదటి వ్యక్తిని కాను. నా ఫొటోలు మార్ఫింగ్ చేసి వివాదం చేయడాన్ని నేను పట్టించుకొను. నా పర్సనాలిటీ నాకు ఉంటుంది. మార్పింగ్ చేసిన ఫోటోలను చూసిన వారు.. అందుకు పాల్పడిన వారిని దుమ్ము దులిపేయాలి. నన్ను అవమానించిన వారికి తగిన బుద్ధి చెప్పాలి.

నీచమైన చేష్టలు బాధపెట్టవు

నీచమైన చేష్టలు బాధపెట్టవు

నా ఫోటోలను మార్ఫింగ్ చేసిన వారికి నేను ఒక్కటే చెప్పాలని ఉంది. నన్ను అశ్లీలంగా చూపించి ఆనందం పడటం వల్ల నేను బాధపడను. నన్ను ఇష్టపడే వారు కూడా ఆందోళనకు గురికారు.

సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు

సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు

నా ఫోటోలను మార్ఫింగ్ చేసిన అంశాన్ని సైబర్ క్రైమ్ పోలీసుల దృష్టికి తీసుకెళ్తాను. నాకు జరిగిన అవమానంపై వారికి ఫిర్యాదు చేస్తాను. చట్టప్రకారం నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతాను అని జిప్సా బేగం వెల్లడించింది.

English summary
Oru Adaar Love movie cast member Jipsa Beegam’s morphed pictures have been leaked online. The actor says that controversies don’t bother her. She has also warned that this case will now be taken to the police to take appropriate action.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu