ఈ పిల్ల మామూలు కాదుగా.. స్టెప్పులతో మతిపోగొడుతున్న ప్రియా వారియర్!
Recommended Video

ప్రియా ప్రకాష్ వారియర్ పేరు వినని యువత ఉండరు. కొన్ని నెలల క్రితం ఒకే ఒక్క సాంగ్ తో నేషనల్ సెలేబ్రిటిగా మారిపోయింది. కానీ గీటిన వీడియోతో యువత హృదయాలకు కళ్లెం వేసిన ఈ మలయాళీ పిల్ల మరో మారు రెచ్చిపోయింది. ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తున్న ఒరు ఆధార్ లవ్ చిత్రంలోని మరో వీడియో సాంగ్ ని విడుదల చేశారు. నిన్ననే యూట్యూబ్ లో విడుదల చేసిన ఈ సాంగ్ కు అప్పుడే మిలియన్ల కొట్టి వ్యూస్ మొదలైపోయాయి.

కొరియోగ్రఫీ అదుర్స్
ఒరు ఆధార్ లవ్ చిత్రంలోని ఫ్రీక్ పెన్నే సాంగ్ విడుదల చేశారు. సాంగ్ లో కొరియోగ్రఫీ అదిరిపోయింది. రోషన్ అబ్దుల్, ప్రియా వారియర్, మరో భామ నోరిన్ షెరీఫ్ ఈ సాంగ్ లో పెర్ఫామ్ చేశారు. స్టైలిష్ గా సంగీతానికి అనుగుణంగా ఉన్న స్టెప్పులు మతి పోగొట్టే విధంగా ఉన్నాయి.

ఎనర్జిటిక్ సాంగ్
సాంగ్ మొత్తం చాలా ఎనెర్జిటిక్ గా సాగుతుంది. ప్రియా వారియర్ నడక, సింపుల్ గా కట్టుకునే స్టెప్పులు చూపు తిప్పుకోనీయవు. నోరిన్ షెరీఫ్ కూడా అదరగొట్టేసింది. ఏ సాంగ్ కు అప్పుడే మిలియన్ కు పైగా వ్యూస్ రావడం విశేషం.

విడియోలతోనే
ప్రియవారియర్ వింక్ వీడియోకి వచ్చిన రెస్పాన్స్ తో ఓరు ఆధార్ లవ్ చిత్రం ఎక్కువగా వీడియో సాంగ్స్ విడుదల చేస్తూ చిత్రానికి ప్రచారం కల్పించుకుంటోంది తొలుత విడుదల చేసిన వింకింగ్ వీడియోతో ప్రియవారియర్ ఒక్కసారిగా క్రేజీ సెలేబ్రిటిగా మారిపోయింది.
ట్రోలింగ్ కూడా
తాజగా విడుదల చేసిన సాంగ్ కు ఏస్థాయిలో స్పందన లభిస్తోందో అదేస్థాయిలో ట్రోలింగ్ కూడా జరుగుతోంది. ప్రియవారియర్ లుక్స్ పై కొందరు అభిమానులు నిరాశతో ఉన్నారు. అందుకే ఈ వీడియోకు 2 లక్షలకు పైగాడిస్ లైకులు కొట్టి తమ నిరాశని వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











