ఇంటర్నెట్ సెన్సేషన్ ప్రియా వారియర్ మూవీ ఎట్టకేలకు..
2018 ఇండియాలో బిగ్గెస్ట్ ఇంటర్నెట్ సెన్సేషన్ ఎవరు? అంటే ప్రియా వారియరే అని స్పష్టం చేస్తోంది గూగుల్. ఇటీవల విడుదలైన గూగుల్ ఇయర్‌ఎండ్ రిపోర్టులో ఈ ఏడాది ఇంటర్నెట్లో అత్యధిక మంది ప్రియా వారియర్ గురించే వెతికారని తేలింది.
ప్రియా వారియర్ నటిస్తున్న మలయాళ చిత్రం 'ఓరు అడార్ లవ్' అనే చిత్రంలోని ఓ చిన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం, అందులో ప్రియా కన్నుగీటుతున్న సీన్ కుర్రకారుకు తెగ నచ్చేయడంతో దేశ వ్యాప్తంగా పాపులరిటీ సంపాదించుకుంది ఈ కేరళ బ్యూటీ.

అయితే 'ఓరు అడార్ లవ్' మూవీ ఇప్పటికే విడుదలవ్వాల్సి ఉండగా... పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. దీంతో పాటు సినిమాలో ప్రియా వారియర్‌కు పబ్లిసిటీ బాగా పెరగడంతో నిడివి పెంచుతూ దర్శకుడు ఓమర్ లులు కొన్ని మార్పులు చేశాడు. అంతా సిద్ధమవ్వడంతో ఈచిత్రం రిలీజ్ డేట్ ఖరారు చేశారు.
2019 ఫిబ్రవరి 14న.... ప్రేమికుల దినోత్సవం సందర్భంగా 'ఓరు అడార్ లవ్' విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ చిత్రానికి ఒమర్ లులు దర్శకత్వం వహించారు. ప్రియా వారియర్, రోషన్ అబ్దుల్ రవూఫ్, సియద్ షాజహాన్, నూరిన్ షరీఫ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా విడుదల తర్వాత ప్రియా వారియర్‌కు మరిన్ని అవకాశాలు ఖాయంగా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











