ఆ సూపర్ స్టార్ నాతో దారుణంగా.. మీరా జాస్మిన్‌ను కూడా.. హీరోయిన్ పార్వతి సంచలన వ్యాఖ్యలు

మలయాళ చిత్ర పరిశ్రమలో ఎలాంటి దాపరికం లేకుండా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే హీరోయిన్లలో పార్వతి తిరువోతు ఒకరు. ఎదుటి వాళ్లు ఏమనుకొంటారనే విషయాన్ని పట్టించుకోకుండా తాను చెప్పాలనుకొనే విషయాలను ముక్కుసూటిగా చెప్పేస్తుంటారు. తాజా ఇంటర్వ్యూలో మలయాళ సూపర్‌స్టార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..

సెట్లో ఉన్నంత సేపు ఊగిపోయేవారు

సెట్లో ఉన్నంత సేపు ఊగిపోయేవారు

మలయాళ సూపర్‌స్టార్లలో ఒకరితో ఇటీవల పనిచేశాను. అయన సెట్లో నాతో చాలా దారుణంగా వ్యవహరించారు. సెట్లో ఉన్నంత సేపు అసహనంతో ఊగిపోయేవారు. ఆయన అలా ప్రవర్తించడానికి కారణమేమిటో అర్ధం కాలేదు. ఆయన మాట్లాడితే ఎవరినో ఒకరిని టార్గెట్ చేసినట్టు ఉండేది అంటూ పార్వతి చెప్పడం మీడియాలో కలకలం రేపింది.

ఆయన స్థాయికి తగినట్టుగా కాకుండా

ఆయన స్థాయికి తగినట్టుగా కాకుండా

సూపర్ స్టార్ గురించి పార్వతి మరిన్ని విషయాలు వెల్లడిస్తూ.. ఆయన ప్రవర్తన కూడా స్థాయికి తగినట్టు ఉండేది కాదు. ఓ సారి నాకు మతిస్థిమితం లేదంటూ నన్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. షూటింగ్ జరిగినన్నీ రోజులు నాతో చాలా దురుసుగా ప్రవర్తించారు అని చెప్పారు. అయితే ఆ సూపర్‌స్టార్ పేరు చెప్పడం సరికాదు అంటూ ఆమె ఓ ప్రశ్నను దాటవేశారు.

మీరా జాస్మిన్ గురించి కూడా

మీరా జాస్మిన్ గురించి కూడా

ఓసారి హీరోయిన్ మీరా జాస్మిన్ గురించి తప్పుగా మాట్లాడారు. నన్ను, ఆమెను కలిపి ఓ మాట అన్నారు. మీరిద్దరూ స్వతహాగా ప్రతిభావంతులు కాదు. దర్శకులు ప్రతిభ కారణంగానే మీకు గుర్తింపు అంటూ కామెంట్లు చేశారు. మా ఇద్దరికి ఏదో మానసిక రుగ్మత ఉందని కామెంట్ చేయడం బాధ కలిగించింది అంటూ పార్వతి చెప్పారు.

నిజం మాట్లాడితే మతి స్థిమితం లేదని

నిజం మాట్లాడితే మతి స్థిమితం లేదని

మలయాళ చిత్ర పరిశ్రమలో ఓ విచిత్ర పరిస్థితి కనిపిస్తుంంది. ఎవరైనా ముక్కుసూటిగా మాట్లాడితే వారికి మతిస్థిమితం లేదని ముద్ర వేస్తారు. నాకు నిజాలు మాట్లాడటం అలవాటు. మనసులో ఒకటి పెట్టుకొని బయటకు మరోటి మాట్లాడటం రాదు. అందుకే ఇండస్ట్రీలో చాలా ఇబ్బందులకు గురి అవుతాను అని పార్వతి అన్నారు.

Recommended Video

Actor Murali Mohan About Viceroy Hotel Incident || Filmibeat Telugu
మమ్ముట్టిపై కూడా తీవ్ర విమర్శలు

మమ్ముట్టిపై కూడా తీవ్ర విమర్శలు


మలయాళ ఇండస్ట్రీలో హీరోయిన్ పార్వతికి ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఓ ఫిలిం ఫెస్టివల్‌లో మమ్ముట్టి నటించిన కసాబా నటించిన చిత్రంపై బహిరంగ విమర్శలు చేయడం వివాదంగా మారింది. ఆమె వ్యాఖ్యలపై పలువురు హీరోలు, హీరోయిన్లు అభ్యంతరం, ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా పార్వతిని మమ్ముట్టి అభిమానులు సోషల్ మీడియాలో వేధింపులకు పాల్పడటం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X