Patriot Censor Report: పేట్రియాట్ మూవీకి సెన్సార్ బ్రేక్.. మమ్ముట్టి, మోహన్‌లాల్ సినిమా రిపోర్ట్ ఏమిటంటే?
మలయాళం సూపర్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్‌లాల్ కలిసి నటిస్తున్న మల్టీ స్టారర్ చిత్రం పెట్రియాట్. ఈ చిత్రంలో టాప్ స్టార్స్ ఫాహద్ ఫాజిల్, నయనతార, దర్శన రాజేంద్రన్, రేవతి, కుంచకో బోబన్, రాజీవ్ మీనటన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మహేష్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్నారు.క ఆంటో జోసెఫ్ ఫిల్మ్ కంపెనీ, బ్లూ టైగర్స్ లండన్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ చిత్రానికి ఆంటో జోసెఫ్, కేజీ అనిల్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
స్పై, యాక్షన్, థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. సినిమాటోగ్రఫి: మనుష్ నందన్, ఎఢిటింగ్: మహేష్ నారాయణన్, రాహుల్ రాధాక్రిష్ణన్, మ్యూజిక్: సుషిన్ శ్యామ్ తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఈ చిత్రం మే 1 తేదీ, 2026 రోజున రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెన్సార్ సర్టిఫికేషన్ (CBFC) రివ్యూ చేశారు. అయితే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు, పాత్రల పేర్లపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దాంతో సెన్సార్ బోర్డు సూచించిన మార్పులు, చేర్పులు, ఇతర వ్యవహారాలపై చిత్ర యూనిట్ దృష్టిపెట్టినట్టు సమాచారం. ఈ సినిమాలో అభ్యంతరాలు వ్యక్తం చేసిన వివరాల్లోకి వెళితే..

పెట్రియాట్ సినిమాను చూసిన సెన్సార్ బోర్డు ప్రతినిధులు, అధికారులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలపై కత్తెర వేయనున్నట్టు, అలాగే కొన్ని పాత్రల పేర్లను మార్చాలని పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ చిత్ర యూనిట్‌కు సెన్సార్ అధికారుల తెలిపారు. అలాగే కొన్ని సన్నివేశాలను తొలగించాలని ఆంక్షలు విధించారనే విషయం మాలీవుడ్‌లో భారీ చర్చకు దారి తీసింది.
వివాదాస్సద అంశాలతో పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలోని విలన్ పాత్ర విషయంలో సెన్సార్ బోర్డు అధికారులు ప్రత్యేకంగా పట్టుబట్టారు. ఆ పాత్ర పేరును మార్చాలని చిత్ర యూనిట్‌కు సూచించారు. ఈ చిత్రంలోని విలన్ పాత్ర పేరు ఓ పొలిటికల్ లీడర్ కుమారుడి పేరు ఒకేలా ఉండటంతో వివాదమయ్యే అవకాశాలు స్పష్టంగా ఉండటంతో ఆ పేరును మార్చాలని సెన్సార్ అధికారులు తెలిపారని తెలిసింది.
అయితే సెన్సార్ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో చిత్ర యూనిట్ మార్పులు, చేర్పులు, తొలగింపులు చేసే ప్రక్రియను చేపట్టింది. ఈ సినిమా రీ ఎడిట్ చేసే పనిలో నిమగ్నమైంది. త్వరలోనే ఈ సినిమాకు మార్పులు చేసి సెన్సార్‌కు తిరిగి సబ్మిట్ చేయనున్నట్టు తెలిసింది. ఈ మేరకు రిలీజ్ డేట్ సమీపిస్తున్న నేపథ్యంలో ఎడిటింగ్ పనులు కోచిలోని ప్రముఖ స్టూడియోలో యుద్ద ప్రతిపాదికన చేస్తున్నారు. ఇటీవల కాలంలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌తొ రూపొందిన జననాయగన్, ఇతర చిత్రాలు సెన్సార్ నుంచి అడ్డంకులను ఎదుర్కొవడం తెలిసిందే.


Click it and Unblock the Notifications